‘సైరా’కు సన్నద్ధమవుతున్న రామ్ చరణ్ !

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమాలో నటిస్తూనే నిర్మాతగా తండ్రి చిరంజీవి యొక్క 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితంకానున్న ఈ సినిమాను మెగా కాంపౌండ్ చాలా ప్రతిష్టాత్మాకంగా భావిస్తోంది.

అందుకే ఇంకొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు ఎలాంటి ఆటంకం కలుగకుండా, అన్ని పనులు ప్రణాళిక ప్రకారమే జరిగి సినిమా విజయవంతం కావాలని చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఈరోజు ఉదయం తిరుమలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో, సినీ ప్రేక్షకులంలో భారీ స్థాయి అంచనాలున్నాయి.

 

Like us on Facebook