‘రంగస్థలం’లో ఒక్కో పాట ఒక్కో ఎత్తు !

‘రంగస్థలం’లో ఒక్కో పాట ఒక్కో ఎత్తు !

Published on Mar 23, 2018 11:00 AM IST

మార్చి 30 విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ‘రంగస్థలం’ టీమ్ ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సినిమాకు ప్రధాన బలంగా భావిస్తున్న పాటలు ప్రోమోలను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఇప్పటీకే బయటికొచ్చిన ‘రంగ రంగ రంగస్ధలాన, రంగమ్మ మంగమ్మ’లు ఆకట్టుకోగా ఇప్పుడు ఆడియోలోనే సూపర్ హిట్ గా నిలిచిన ‘ఎంత సక్కగున్నావే’ ప్రోమో విడుదలైంది.

పాటను తెరకెక్కించిన విధానం, రామ్ చరణ్, సమంతల పల్లెటూరి గెటప్స్ చూస్తుంటే ఈ పాట కూడ విజువల్ వండర్ గా నిలుస్తుందనిపిస్తోంది. మొత్తం మీద ఒక్కో పాట ఒక్కో ఎత్తులా ఉన్న ‘రంగస్థలం’ చిత్రం మంచి సక్సెస్ సాధించేలా కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

ప్రోమో కొరకుక్ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు