పాటల చిత్రీకరణలో ‘రంగస్థలం’ !

పాటల చిత్రీకరణలో ‘రంగస్థలం’ !

Published on Oct 25, 2017 3:11 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘రంగస్థలం-1985’ పై ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలున్నాయో తెలిసిందే. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరోవైఫు సుకుమార్ మాత్రం నిదానంగా సినిమా చేస్తూ ఖచ్చితత్వం లోపించకుండా చూసుకుంటున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ప్రత్యేక పల్లెటూరి సెట్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఆ చిత్రీకరణకు సంబందించిన ఒక ఫోటోను చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫోటోను చూస్తుంటే పండుగ వాతావరణాన్ని తలపిస్తూ పాట మంచి మాస్ తరహాలో ఉంటుందేమో అనిపిస్తోంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 1985 ల కాలంలో జరగబోయే ప్రేమ కథగా ఉండనున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు