భారీ ధరకు అమ్ముడైన రవితేజ సినిమా హక్కులు !

భారీ ధరకు అమ్ముడైన రవితేజ సినిమా హక్కులు !

Published on Feb 17, 2018 4:14 PM IST

ఇటీవలే ‘టచ్ చేసి చూడు’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ‘నేల టికెట్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా గత నెలలో మొదలై ఒక షెడ్యూల్ ముగించుకుని రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో రవి తేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కులను ప్రముఖ ఛానెల్ సన్ టీవీ రూ.25 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలుచేసింది. దీంతో నిర్మాతకు ప్రీ రిలీజ్ బిజినెస్ లాభదాయంగానే ఉండే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, ప్రవీణ్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు