రకుల్ బాటలో రెజినా..

రకుల్ బాటలో రెజినా..

Published on Jul 3, 2015 6:38 PM IST

Regina-Cassandra-and-rakul-
యంగ్ హీరోయిన్లు గా రెజినా, రాకుల్ ప్రీత్ దాదాపు ఒకేసారి తమ కెరీర్ లు మొదలుపెట్టారు. అయితే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి ఒక ఘనమైన హిట్ రాకుల్ ప్రీత్ ని పెద్ద హీరోలకి ఫస్ట్ ఛాయిస్ ని చేసింది. దానికి తోడు గోపిచంద్ లౌక్యం తో ఆమెను గోల్డెన్ లెగ్ గా అందరూ భావించడం మొదలుపెట్టారు.

దాంతో ఇక ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు చరణ్, ఎన్‌టి‌ఆర్, అల్లు అర్జున్ సినిమాలలో హీరోయిన్ గా దున్నేస్తోంది. ఇక రెజినా విషయానికి వస్తే చేయడానికి చేతిలో సినిమాలు ఉన్నా కానీ ఆమెను టాప్ హీరోలు ఇప్పటివరకు కన్సిడర్ చేయలేదు.

కానీ చూస్తుంటే ఆమె టైమ్ మారినట్టే కనిపిస్తోంది. ఇప్పటివరకు బడ్డింగ్ హీరోలతో తన కెరీర్ కొనసాగించిన రెజినా తొలిసారి వేరే లీగ్ లోకి వెళ్తోంది. గోపిచంద్ తన తర్వాతి సినిమాలో రెజినా ను కన్ఫర్మ్ చేశారు. ఇక ఈమకు కూడా ఒక లౌక్యం లాంటి సినిమా పడితే రెజినా ను కూడా పెద్ద హీరోలు కన్సిడర్ చేయడం మొదలుపెట్టడం సర్వసాధారణం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు