భారీ ప్రాజెక్ట్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న శృతి హాసన్ !


శృతి హాసన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అవి కూడా భారీ చిత్రాలు కావడం విశేషం. మొదట తండ్రి కమల్ హాసన్ చేస్తున్న ‘శభాష్ నాయుడు’ లో నటించిన ఆమె తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘కాటమరాయుడు’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు కాక తాజాగా ఆమెకు మరో భారీ ఆఫర్ వచ్చిందట. శృతి హాసన్ కూడా కాదనకుండా ప్రపోజల్ కు ఓకే చెప్పేసిందట.

అదే ప్రముఖ దర్శకుడు సుందర్ సి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ. 400 కోట్లని అంటున్నారు. ‘సంఘమిత్ర’ అనే టైటిల్ నిర్ణయించబడ్డ ఈ చిత్రంలో జయం రవి, ఆర్యలు ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఎప్పుడు మొదలవుతుంది, ఇతర టెక్నీషియయన్లు, నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలుయనున్నాయి.

 

Like us on Facebook