‘బెంగళూరు డేస్’ రీమేక్ లో నటించడం లేదు – సిద్దార్ద్.

‘బెంగళూరు డేస్’ రీమేక్ లో నటించడం లేదు – సిద్దార్ద్.

Published on Jan 30, 2015 2:40 PM IST

Siddharth
మలయాళంలో ఘనవిజయం సాదించిన ‘బెంగళూరు డేస్’ సినిమాను తెలుగు, తమిళ భాషలలో పివిపి సంస్థ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమాలో సిద్దార్ధ్, సమంత నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను సిద్దార్ధ్ ఖండించారు. ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడించారు. త్వరలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వెల్లడిస్తానని చెప్పారు. సిద్దార్ధ్, సమంతల లవ్ ఫెయిల్యూర్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.

‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ రీమేక్ దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయని సమాచారం. మార్చ్ 1వ తేదీ నుండి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళంలో ఆర్య, నిత్యా మీనన్, బాబీ సింహా.. తెలుగులో కమెడియన్ నుండి హీరోగా ప్రమోట్ అయిన హీరో సునీల్ కీలక పాత్రల్లో నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు