S/O సత్యమూర్తి ప్రమోషనల్ సాంగ్ అదుర్స్!

S/O సత్యమూర్తి ప్రమోషనల్ సాంగ్ అదుర్స్!

Published on Apr 2, 2015 10:58 AM IST

Allu-arjun-DSP
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్‌ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ప్రచార చిత్రాలు, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేసింది. సినిమాకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మార్చి 15న విడుదల చేసిన పాటలు అభిమానుల్లో జోరును నింపింది.

ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదలవుతోన్న సందర్భంగా సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. నిన్న (ఏప్రిల్ 1) అల్లు అర్జున్, దేవీశ్రీ ప్రసాద్‌లతో షూట్ చేసిన ఒక ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్, దేవీశ్రీ ప్రసాద్ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తూ అలరిస్తున్నారు. గతంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి సినిమాకు కూడా ఇదే తరహాలో ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసి హిట్ కొట్టిన విషయం తెలిసిందే! సినిమా విడుదలకు వారం రోజులే ఉన్నందున చిత్ర యూనిట్ సరికొత్త ప్రమోషన్ దిశగా ఆలోచిస్తోంది.

S/O సత్యమూర్తి ప్రమోషనల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు