‘శ్రీమంతుడు’కి సూపర్బ్ పాజిటివ్ రెస్పాన్స్

‘శ్రీమంతుడు’కి సూపర్బ్ పాజిటివ్ రెస్పాన్స్

Published on Aug 3, 2015 9:13 PM IST

Mahesh-srimantudu
స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే అభిమానుల్లో అంచనాలతో పాటు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే పాజిటివ్ రెస్పాన్స్ ఉండడం కూడా కామన్ గా జరిగే విషయమే.. కానీ రిలీజ్ కి ముందే ఇండస్ట్రీ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకునే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ వారం బాక్స్ ఆఫీసు ముందుకు రానున్న సినిమా శ్రీమంతుడు’. టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమా ఆగష్టు 7న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రేపు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది.

మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ కాపీని ఈ చిత్ర టీంతో పాటు పలువురు ప్రముఖులు కూడా చూసారు. వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం సినిమా చాలా బాగా వచ్చిందని, సినిమా కచ్చితంగా అభిమానుల్ని, తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా ఈ సినిమా బాగా వచ్చిందని ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇలా ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు అభిమానుల్ని మెప్పించడమే కాకుండా, బాక్స్ ఆఫీసు వద్ద భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంటాయి. ఈ లెక్క ప్రకారం ‘శ్రీమంతుడు’ మొదటి వారం సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకుంటుందని అంటున్నారు.

మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు