కొత్త సినిమాను కన్ఫర్మ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ !

మెగాస్టార్ ‘ఖాదీ నెం 150’ చిత్రంతో మరోసారి తన మాస్ సత్తాను చయినా దర్శకుడు వి.వి. వినాయక్ ఆ సినిమా ఇచ్చియాన్ విజయంతో వరుస సినిమాల్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సి. కళ్యాణ్ నిర్మాణంలో మెగాహీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమాను చేస్తున్న ఆయన మరో సినిమాను కూడా ఖాయం చేసుకున్నారు.

ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాణంలో ఈ సినిమా ఉండనుంది. అయితే ఇందులో హీరో, హీరోయిన్లు, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరనే విషయాలు ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇకపోతే ధరమ్ తేజ్ తో చేస్తున్న సినిమా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుంది.

 

Like us on Facebook