వాయిదాపడిన సందీప్ కిషన్ కొత్త సినిమా !

వాయిదాపడిన సందీప్ కిషన్ కొత్త సినిమా !

Published on Jan 21, 2018 1:11 PM IST

యంగ్ హీరో సందీప్ కిషన్ చేస్తున్న సినిమాల్లో ‘మనసుకు నచ్చింది’ కూడా ఒకటి. మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కొత్త తరహా లవ్ స్టోరీగా ఉండనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని ముందుగా జనవరి 26న రిపబ్లిక్ డే నాడు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. కానీ కారణాలు తెలియయరాలేదు కానీ అది కాస్త వాయిదాపడి ఫిబ్రవరి 16కు మారినట్టు సమాచారం.

ఒక విధంగా ఈ వాయిదా కూడా మంచిదే. ఎందుకంటే ముందుగా అనుకున్న జనవరి 26 నాడు పోటీగా ‘భాగమతి, ఆచారి అమెరికా యాత్ర’ వంటి సినిమాలున్నాయి. అదే ఫిబ్రవరి 16 న మరే ఇతర సినిమాల విడుదల లేదు. వసూళ్ల పరంగా ఇది కొంచెం కలిసొచ్చే అంశమే. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రతన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అభిప్రాయమే ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు