హైదరాబాద్ లో తమిళ్ స్టార్ హీరో సినిమా షూటింగ్ !

హైదరాబాద్ లో తమిళ్ స్టార్ హీరో సినిమా షూటింగ్ !

Published on Mar 22, 2018 1:12 PM IST

గతంలో ‘వీరమ్’ ‘వేదాళం’ ‘వివేకం’ సినిమాలతో అజిత్ కి హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివ తాజాగా ‘విశ్వాసం’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది.అజిత్ పై సాంగ్ షూట్ చేస్తున్నారు యూనిట్. వరుసగా నాలుగోసారి శివ అజిత్ ను డైరెక్ట్ చేస్తుండడం విశేషం.

ఈ చిత్రం కోసం భారీ వ్యయంతో ఉత్తర చెన్నైని పోలిన సెట్ ను నిర్మించారు. తాజాగా ఆ సెట్స్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్ ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. వారం పాటు ఇక్కడ ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చితీకరించబోతున్నారు. ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నాడనితెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు