నవంబర్ 21న తెలుగులో ‘కత్తి’ విడుదల..?

నవంబర్ 21న తెలుగులో ‘కత్తి’ విడుదల..?

Published on Oct 29, 2014 8:29 PM IST

kathi
విజయ్, సమంత జంటగా నటించిన తమిళ సినిమా ‘కత్తి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపావళి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో నవంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. యువ సంగీత సంచలనం, ‘కొలవేరి డి’ ఫేం అనిరుధ్ కంపోజ్ చేసిన ఆడియోను త్వరలో విడుదల చేయనున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరిచారు నిర్మాత ఠాగూర్ మధు. పవన్ రీమేక్ కు నో చెప్పడంతో డబ్బింగ్ వెర్షన్ ను విడుదల చేస్తున్నారు. మరోవైపు విజయ్ కూడా తెలుగులో తన మార్కెట్ పెంచుకోవడానికి డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను ‘కత్తి’ సినిమాలో ప్రస్తావించారు దర్శకుడు మురుగదాస్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు