అలా ఐతే చరణ్ కోరమీసం తీసివేయాల్సివస్తుంది.

అలా ఐతే చరణ్ కోరమీసం తీసివేయాల్సివస్తుంది.

Published on Feb 22, 2020 10:42 AM IST

కొద్దిరోజులుగా రామ్ చరణ్ పై ఓ క్రేజీ రూమర్ ప్రచారం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రంలో చరణ్ క్యామియో రోల్ చేస్తున్నారని, అందులోను చరణ్ యంగ్ చిరంజీవి పాత్ర చేస్తున్నారంటూ ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పటికే చాలా మాధ్యమాలలో ఈ న్యూస్ ప్రచురించడం జరిగింది. ఐతే ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీలో సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. అందుకోసం ఆయన పెద్ద కోర మీసం పెంచారు. బయట కూడా చరణ్ అదే మీసంతో కనిపిస్తున్నారు.

ఇక ప్రచారం జరుగుతున్నట్లు చరణ్ యంగ్ చిరంజీవిలా నటిస్తే ముదురు కోరమీసంతో నటించడం కుదరదు.మీసం తీసేస్తే ఆర్ ఆర్ ఆర్ లో పాత్రకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి చిరు 152వ చిత్రంలో చరణ్ యంగ్ చిరంజీవిలా కనిపించే ఆస్కారం లేదని కొందరు భావిస్తున్నారు. చిత్రం విడుదల అయ్యేవరకు ఈ విషయంపై స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు