అల్లు అరవింద్ సోదరి కన్నుమూత

అల్లు అరవింద్ సోదరి కన్నుమూత

Published on Dec 5, 2016 3:18 PM IST

allu-arvind
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట నేడు విషాదం నెలకొంది. ఆయన సోదరి శ్రీ భారతి ఈ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలను అల్లు వారి కుటుంబానికి చెందిన కోకాపేటలోని ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్‌కు దగ్గర్లోనే ఉన్న ఈ ఫాంహౌస్‌కి అల్లు కుటుంబ సభ్యులంతా హాజరు కాగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

అల్లు అరవింద్ తండ్రి, ప్రముఖ నిర్మాత, నటుడు అయిన అల్లు రామలింగయ్య అంత్యక్రియలు కూడా అప్పట్లో ఇదే ఫాంహౌస్‌లో నిర్వహించారు. శ్రీ భారతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆమె మృతి పట్ల 123తెలుగు తరపున సంతాపం ప్రకటిస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు