నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటున్న గురు!
Published on Nov 2, 2016 2:10 pm IST

guru
విక్టరీ వెంకటేష్ మళ్ళీ సినిమాల జోరు పెంచిన విషయం తెలిసిందే. ‘బాబు బంగారం’కి ముందు వరకూ కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన, ఇప్పుడు శరవేగంగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హీరోగా నటిస్తోన్న గురు ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. వైజాగ్‌లో నాన్‌స్టాప్‌గా ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నారు. వెంకీ, రితిక తదితరులు పాల్గొంటుండగా ప్రస్తుతం పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

తమిళ, హిందీ భాషల్లో మంచి విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’కు రీమేక్‌గా ‘గురు’ సినిమా తెరకెక్కుతోంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తోనే అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా వెంకీ రఫ్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పక్కా ప్లాన్‌తో అతి తక్కువ వర్కింగ్ డేస్‌లో సినిమాను పూర్తి చేసి డిసెంబర్ నెలాఖర్లో కానీ, జనవరి మొదట్లో కానీ విడుదల చేయాలనుకుంటున్నారట. వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రితికా సింగ్‌కు బాక్సింగ్ కోచ్‍గా వెంకీ కనిపించనున్నారు.

 
Like us on Facebook