మార్చి నుండి విజయ్ దేవరకొండ తమిళ సినిమా !

మార్చి నుండి విజయ్ దేవరకొండ తమిళ సినిమా !

Published on Feb 20, 2018 3:00 PM IST

‘అర్జున్ రెడ్డి’ సినిమా తరువాత విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో పరుశురాం బుజ్జి దర్శకత్వంలో ఒక సినిమా రాహుల్ సంకృత్యాయ‌న్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా యొక్క ప్రీ లుక్ కూడ విడుదలైంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ‘టాక్సీవాల’ అనే టైటిల్ పరిశీలలో ఉంది. ఈ సినిమా తరువాత విజయ్ మరో రెండు సినిమాలకు కమిటైనట్లు తెలుస్తోంది.

వీటిలో తమిళంలో‘ఇరుముగన్’ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ డైరక్షన్లో ఒక సినిమా ఉండనుంది. మార్చి రెండో వారంలో ప్రారంభం కానున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించబోతోంది. ఈ మూవీతో పాటు భరత్ కమ్మ అనే నూతన దర్శకుడితో కూడ సినిమా చేయనున్నాడు దేవరకొండ. ‘పెళ్లి చూపులు’ సినిమా నిర్మాత యష్ రంగినేని ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు