భారీ ధరకు అమ్ముడైన విజయ్ సినిమా శాటిలైట్ రైట్స్ !
Published on Jul 2, 2017 1:26 pm IST


తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘మెర్సల్’ షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పట్ల తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేగాక విజయ్ త్రిపాత్రాభినయం చేస్తుండంతో అభిమానుల్లో మరింత ఉత్సుకత చోటు చేసుకుంది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రేజ్ ను వల్లనే సినిమా హక్కులు కళ్ళు చెదిరే ధర పలుకుతున్నాయి. తాజాగా ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ టీవీ ఛానెల్ రూ.30 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్టు సమాచారం. దీంతో పాటే డిస్ట్రిబ్యూషన్ ఇతర హక్కుల అమ్మకాలు కూడా పెద్ద మొత్తంలోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా ‘అదిరింది’ పేరుతో ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు.

 
Like us on Facebook