విశాల్ ‘అభిమన్యుడు’ విడుదల ఎప్పుడంటే !

విశాల్ ‘అభిమన్యుడు’ విడుదల ఎప్పుడంటే !

Published on May 21, 2018 6:13 PM IST

విశాల్, సమంత జంటగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకం ఫై పి.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందిన సినిమా ‘ఇరుంబు తిరై’. ఇటీవల తమిళనాడులో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ దిశగా వెళుతోంది ఈ చిత్రం. ఈ సినిమా ఒక్క తమిళనాడులోనే కేవలం 10 రోజుల్లో రూ. 21కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి విశాల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

ఈ చిత్రాన్ని జి. హరి’ అభిమన్యుడు’ పేరుతో జూన్ 1న తెలుగులో విడుదల చేస్తున్నారు. ముందుగా ఈ నెల 25న ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. సైబర్ యుద్ధం మరియు డేటా దొంగతనం నేపథ్యం లో సాగే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ ‘అర్జున్’ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు గాను మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా విశాల్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో విడుదలవుతుంటాయి. మరి ఈ సినిమా విశాల్ కి తెలుగులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు