తెలుగు, తమిళ్లో రానున్న హిందీ ‘బాహుబలి’!!

తెలుగు, తమిళ్లో రానున్న హిందీ ‘బాహుబలి’!!

Published on Nov 26, 2015 5:13 PM IST

Bajirao-Mastani
టైటిల్ చూసి అదేంది బాహుబలి అనే సినిమా తెలుగు నుంచి హిందీకి వెళ్ళిన సినిమా కదా, మళ్ళీ ఇప్పుడ అదే సినిమాని తెలుగు తమిళ్ లో రిలీజ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా?? ఎక్కువ షాక్ అవ్వకండి నేను ఇక్కడ హిందీ బాహుబలి అని చెప్పింది డిసెంబర్ 18న రిలీజ్ కానున్న బాలీవుడ్ మూవీ ‘భాజీరావ్ మస్తానీ’ గురించి.. తెలుగులో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బాహుబలి సినిమాలనే హిందీలోనూ అలనాటి మరాఠీ యోధుడు భాజీరావ్ పీష్వా జీవితాదారంగా చేసుకొని చేసిన భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘భాజీరావ్ మస్తానీ’. పీరియడ్ బ్యాక్ డ్రాప్ సినిమా అంటే చాలు ఆ సినిమాలపై అంచనాలను పెంచేసేలా చేసిన సినిమా ‘బాహుబలి’.

అలాగే ఇలాంటి రాజుల కథలకి భాషా భేదం ఉండదు. కాబట్టి ఏ భాషలో అయినా ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేస్తారు. అందుకే సంజయ్ లీలా భన్సాలి ఈ సినిమాని హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యి, తెలుగు తమిళ భాషలకి చెందిన డబ్బింగ్ వర్క్స్ ని కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం తెలుగులోని ఫేమస్ రైటర్స్ ని తీసుకొని తెలుగు, తమిళ నేటివిటీకి సరిపోయేలా పాటలను, డైలాగ్ వెర్షన్స్ ని రాయిస్తున్నారు. మరో 10-12 రోజుల్లో అన్ని డబ్బింగ్ కార్యక్రమాలను ఫినిష్ చేసే హిందీతో పాటు తెలుగు, తమిళ వెర్షన్స్ ని కూడా డిసెంబర్ 18న రిలీజ్ చేయనున్నారు.

భాజీరావ్ పీష్వాగా రన్వీర్ సింగ్ కనిపించనుంటే, అతని జోడీగా హాట్ బ్యూటీస్ అయిన దీపిక పడుకొనే, ప్రియాంక చోప్రా హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు