సమీక్ష : అంతకు ముందు ఆ తరువాత – ఆలోచింపజేసే ప్రేమ కథ

సమీక్ష : అంతకు ముందు ఆ తరువాత – ఆలోచింపజేసే ప్రేమ కథ

Published on Aug 23, 2013 4:43 PM IST
amat-telugu-review విడుదల తేదీ : 23 ఆగష్టు 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకుడు : ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత : కె. ఎల్. దామోదర ప్రసాద్
సంగీతం : కళ్యాణి మలిక్
నటీనటులు : సుమంత్ అశ్విన్, ఇషా..

విమర్శకులను మెప్పించిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఒక కొత్త లవ్ స్టొరీ ‘ అంతకు ముందు.. ఆ తరువాత’. సుమంత్ అశ్విన్ హీరోగా, ఇషా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మించాడు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ :
>అనీల్ (సుమంత్ అశ్విన్)కి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ అతని తల్లి మాత్రం అతనికి పెళ్లి చేయాలని చూస్తూ వుంటుంది. ఈ పెళ్లి గోలను తప్పించుకోవడానికి అనీల్ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటాడు. అతనికి తన తండ్రి (రావు రమేష్) సహాయం చేస్తాడు. హైదరాబాద్లో అనన్య(ఈశ) చూసి ప్రేమలో పడతాడు. అనన్య ఒక పెయింటర్, గ్రీటింగ్ కార్డ్ డిజైనర్. ఆమె లత(ఝాన్సీ) వద్ద పని చేస్తూ ఉంటుంది. అనీల్ అనన్యని ప్రేమలో పడేయడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. అతని లూక్స్ చూసి అనన్య కూడా ప్రేమలో పడుతుంది.  కానీ అనన్య తన భవిషత్తు ఎలా ఉంటుందా అని ఆందోళన చెందుతూ వుంటుంది. ఆమె తల్లిదండ్రులు (రవిబాబు, మధుబాల)తో ఈ విషయం పై గొడవ జరుగుతుంది.

అనిల్ కూడా ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది. ‘ ఇప్పుడున్న అనుబందం, ఆత్మీయత పెళ్లి జరిగిన తరువాత కూడా లానే ఉంటాయా లేక బోర్ కొడతాయా?’ అనే వాదన వారి మనసులో ముద్రించుకుపోతుంది. వారు అన్యోన్యంగా ఉంటారా ? లేదా ? అని తెలుసుకోవడానికి రహస్యంగా కొన్ని రోజులు కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. జీవితంలో రోజు రోజుకు ఒత్తిడి, ఖర్చు ఇలా సమస్యలు పెరగడం మొదలవుతాయి.వారి మద్య ఫైట్ లు వాదనలు మొదలవుతాయి. ఈ జంట మద్య  అనుకోని, ఊహించని ఎమోషనల్ సన్నివేశాలు జరుగుతాయి. మరి వీరి ప్రేమ సజావుగా సాగుతుందా? లేదా? వారి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అనేది తెలియాలంటే  ‘అంతకు ముందు ఆతరువాత చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. తన మొదటి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. తను తీసింది ఒక సినిమా మాత్రమే కానీ ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లో నటించడం చూస్తే ఎన్నో సినిమాలలో నటించినట్టు అనిపిస్తుంది. సుమంత్ అశ్విన్ ఒక మంచి యంగ్ హీరో. తను మంచి డాన్సర్. ఇషా పెర్ఫార్మన్స్ బాగుంది. ఆమె చాలా అందంగా మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. తన పాత్రకు తగిన విదంగా నటించింది.

రోహిణి, రావు రమేష్ లు ఓపికతో కూడిన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. వీరు క్లైమాక్స్ సన్నివేశాలలో నటించిన నటన సినిమాకే ప్రదానంగా చెప్పవచ్చు. విలక్షణ నటి మధుబాల చూడటానికి చాలా బాగుంది. రవి బాబు, ఝాన్సీలు బాగా నటించారు.

మంచి టైంలో వచ్చి శ్రీనివాస్ అవసరాల చెప్పిన ఒక్క లైనర్స్ డైలాగ్స్ చాలా ఎంటర్టైనింగ్ గా వున్నాయి. ఈ సినిమాలో నటించిన మరొకరు రాజేష్ సుమంత్ అశ్విన్ ఆఫీసులో చెప్పే ఒక్క లైన్  డైలాగ్స్ చాలా బాగున్నాయి. అతనిలో హాస్యం పండించగల సామర్థ్యం ఉంది.

ఈ సినిమా మొదటి బాగం చాలా బాగుంది. సుమంత్, ఇషాల మధ్య చిత్రీకరించిన లవ్ స్టొరీని డైరెక్టర్ చాలా బాగా హండిల్ చేశాడు. చాలా సున్నితమైన, ఎమోషనల్ ట్రాక్ బాగుంది. చమత్కారమైన డైలాగ్స్, వారి మద్య కెమిస్ట్రీ సీన్స్ మంచి ఫీల్ ను కలిగిస్తాయి. ఒక కొత్త రకమైన ప్రేమకథ కోసం, దాని చికిత్స కోసం తీసిన సినిమా. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాపై వున్న అబిప్రాయాన్ని మరింత పెంచుతాయి. సున్నితమైన సమస్యలు వ్యక్తిగత బావాలు, పెళ్లి తరువాత సర్దుబాట్లు, కెరీర్ లో ఎదగాలనే మహిళల ఆకాంక్ష మొదలగు అంశాలను చాలా బాగా హండిల్ చేశాడు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా ఇంటర్వల్ అయిన వెంటనే సెకండ్ హాఫ్ కాస్త బోర్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వున్న ఫ్రెస్ నెస్, మ్యాజిక్ సెకండ్ హాఫ్ లో కనిపించదు. కొన్ని అవసరం లేని సన్నివేశాలు ఒకదాని తరువాత ఒకటి వస్తూ వుంటాయి. ఇలాంటి మెలోడ్రామాకి ఆ సన్నివేశాలు అవసరం లేదు. కథలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఒక అబ్బాయితో కూతురు కొన్ని నెలల పాటు రహస్యం ఉండటానికి నిర్ణయించుకోవడం, అది తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుందా? వారికి ఆమె ఏం చెబుతుంది? ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లి ఉండటానికి ఏం సమాదానం చెబుతుంది? అనేది వివరించలేదు.

సుమంత్ అశ్విన్ పూలను సరఫరా చేసే ఆఫీసును ప్రారంబిస్తాడు. అతను ఆమెని బిజినెస్ లో బాగాస్వామిని చేసుకోవడం. దానికోసం తను ఒక ఒక ఆఫీసుని ప్రారంబించడం అది ఒక ఐటి కంపెనీల ఉండటం. అలాగే అతను నిజంగా చేసే బిజినెస్ ఏమిటి? అది ఎలా నడుస్తుంది? దానిని కూడా సరిగా చూపించలేదు. ఝాన్సీ సుమంత్ బాబీగా వచ్చే సన్నివేశాలు, ఇషాకి కాస్త నిరుత్సాహపరుస్తాయి.

సాంకేతిక విభాగం:
పి. జి. విందా సినిమాటోగ్రఫీ ఈ సినిమాపై మంచి ఫీల్ ను కలిగిస్తుంది. కళ్యాణి కోడూరి అందించిన మ్యూజిక్ బాగుంది. తను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా సహాయ పడింది. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ కాస్త బాగా చేసి ఉంటే బాగుండేది. మోహన కృష్ణ ఇంద్రగంటి డైలాగ్స్ చాలా బాగున్నాయి. తను చాలా బాగా సినిమాని తీశాడు. ఫస్ట్ హాఫ్ తో పోల్చు కుంటే సెకండాఫ్ కాస్త శ్రద్ద పెట్టి వుంటే బాగుండేది. తను క్లైమాక్స్ సన్నివేశాలను చాలా బాగా హండిల్ చేశారు.

తీర్పు :
‘అంతకు ముందు ఆ తరువాత’ ఒక మంచి, ఆలోచింపజేసే ప్రేమ కథా చిత్రం. ఈ సినిమాలో మొదటి బాగం వచ్చే సున్నితమైన సన్నివేశాలు యువకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాలో లోపాలు లేవని కాదు. కానీ సినిమాలో వచ్చే చమత్కారమైన డైలాగ్స్ క్లాస్ పెర్ఫార్మెన్స్, కొన్ని ఆలోచింపజేసే సన్నివేశాలు, చివర్లో తీసిన సీన్స్ మంచి ఫీల్ ను కలుగజేస్తాయి. ఇది చూడవలసిన సినిమా.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3. 25/5

రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు
అనువాదం : నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు