సమీక్ష: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ – డల్ గా సాగే క్రైమ్ కామెడీ డ్రామా

సమీక్ష: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ – డల్ గా సాగే క్రైమ్ కామెడీ డ్రామా

Published on Mar 6, 2026 5:03 PM IST

sss 1

విడుదల తేదీ : మార్చి 06, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : శివాజీ, లయ, రోహన్, శరత్ లోహితశ్వ, అలీ, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ మరియు ఇతరులు.
దర్శకుడు : సుధీర్ శ్రీరామ్
నిర్మాత : శివాజీ సోంటినేని
సంగీత దర్శకుడు : రంజిన్ రాజ్
సినిమాటోగ్రాఫర్ : రిత్విక్ రెడ్డి
ఎడిటర్ : బాలు మనోజ్ డి

సంబంధిత లింక్స్ :ట్రైలర్ 

మన టాలీవుడ్ హిట్ జంటల్లో ఒకరైన నటుడు శివాజీ, లయ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. మొదట ఓటిటికి ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

అన్నమయ్య జిల్లా, కొత్తపేట ప్రాంతంలో ఒక నిజాయితీ గల పంచాయితీ సెక్రటరీ శ్రీరామ్ (శివాజీ) తన భార్య ఉత్తర (లయ), కొడుకు మిట్టు (రోహన్) లతో సింపుల్ లైఫ్ స్టైల్ జీవనం సాగిస్తారు. అయితే ఓ రోజు ఆ ఏరియా ఎస్సై విక్రమ్ వాసుదేవ్ (ప్రిన్స్) తో ఓ గొడవ అవుతుంది. ఇంకో సందర్భంలో శ్రీరామ్ లేనప్పుడు తన ఇంటికి కూడా వస్తాడు. కానీ శ్రీరామ్ వచ్చేసరికి ఆ ఎస్సై చనిపోయి ఉంటాడు. మరి ఈ షాకింగ్ పరిస్థితితో శ్రీరామ్ ఏం చేసాడు? అసలు ఆ ఎస్సై ఎలా చనిపోయాడు? దానికి కారణం ఎవరు? ఈ ఊహించని పరిస్థితి నుంచి తన ఫ్యామిలీ ఎలా బయటపడింది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఇందులో నటుడు శివాజీ ఒక హానెస్ట్ పంచాయితీ సెక్రెటరీగా మంచి పెర్ఫామెన్స్ అందించారు. అలాగే తనకి వచ్చిన ఒక ఊహించని పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనే ఓ సామాన్య భర్తగా, తండ్రిగా మంచి నటన కనబరిచారు. అలాగే లయతో కొన్ని సీన్స్ లో మంచి ఫన్ వారి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.

అలాగే మాస్టర్ రోహన్ తనకి ఉన్న లిమిటెడ్ స్క్రీన్ టైం లో మంచి ఫన్ ని జెనరేట్ చేసాడు. అలాగే కొన్ని సీన్స్ లో లయ డీసెంట్ లుక్స్ తో మంచి నటన అందించారు. వీటితో పాటుగా సినిమాలో ఆలీపై కనిపించే ఓ చెక్ పాయింట్ కామెడీ సీన్ కూడా ఇందులో మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ ఏదన్నా ఉంది అంటే అది బలహీనమైన రైటింగ్ అని చెప్పాలి. కథలో సరైన డెవలప్మెంట్ లేదు అలాగే స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో విఫలమైంది. అవసరం లేని అనేక సన్నివేశాలు మరియు పాత్రలు కథనాన్ని మరింత డల్ గా మార్చేసి విసుగు తెప్పిస్తాయి.

అలానే ఈ చిత్రంలో ఉపయోగం లేని పాత్రలు చాలానే కనిపిస్తాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే పాత్ర, తన చుట్టూతా డిజైన్ చేసిన సన్నివేశాలు ఏమాత్రం పొంతన లేకుండా బోరింగ్ గా అనిపిస్తాయి, పైగా అతని గ్యాంగ్ కూడా సినిమాలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ధనరాజ్ పాత్రను చాలా సాధారణంగా పరిచయం చేసి, చివర్లో అతని క్యారెక్టరైజేషన్‌లో చూపించిన సడెన్ ఛేంజ్ అంత నాచురల్ గా అనిపించదు.

మరో ప్రధాన లోపం ఏమిటంటే, సినిమాలో ఒక శవాన్ని మాయం చేయడమనే సీరియస్ నేపథ్యంలో సాగే కథ అయినప్పటికీ, పాత్రలు చూపే ప్రవర్తన మాత్రం వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఉదాహరణకు, శవాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కూడా హీరోయిన్ పాత్ర అతిగా ఉత్సాహం ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. ఒక డార్క్ కామెడీలో టెన్షన్ నుండే హాస్యం పుట్టాలి, కానీ ఇక్కడ ఆ సీరియస్‌నెస్ లోపించింది మరియు కామెడీ బలవంతంగా ఇరికించినట్లుగా ఉంది.

అలాగే అలీ ఎపిసోడ్ ప్రధాన కథకు ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం రన్‌టైమ్ పెంచడానికే పెట్టినట్లుగా ఉంది. ఇలానే చాలా సన్నివేశాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా అతికించినట్లుగా అనిపిస్తాయి తప్ప, కథలో ఒక ఫ్లోలో ఉన్నట్టు అనిపించవు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. రంజిన్ రాజ్ సంగీతం కూడా ఈ సినిమాలో పర్వాలేదు అనిపిస్తుంది. కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. బాలు మనోజ్ డి ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. 2 గంటల 26 నిమిషాల నిడివిలో చాలావరకు సన్నివేశాలు తగ్గించాల్సింది.

ఇక దర్శకుడు సుధీర్ సాయిరాం విషయానికి వస్తే.. తాను ఓ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ని ట్రై చేశారు కానీ తెరపై ఆవిష్కరించడంలో తాను బాగా తడబడ్డారు.మైథిలి కుమార్, సుధీర్ ల రైటింగ్ చాలా వీక్ గా ఉంది. వీటితో కథనం మరింత బలహీనంగా మారింది. వీటితో వీరి మాత్రం అంతగా మెప్పించలేదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని’ ఒక డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా ప్లాన్ చేశారు కానీ ఇది ఆకట్టుకోకుండానే ఎండ్ అవుతుంది. శివాజీ, రోహన్ లు కొన్ని సీన్స్ లో షైన్ అయ్యారు. కానీ కథ, కథనాల్లో మాత్రం కొత్తదనం పెద్దగా లేదు, అవుట్ డేటెడ్ రచన కొన్ని ఫోర్స్డ్ సన్నివేశాలతో బోర్ కలిగిస్తుంది. సో ఈ చిత్రం బదులు వేరే సినిమాలు ఈ వీకెండ్ కి ప్లాన్ చేసుకుంటే బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు