సమీక్ష: గులేబకావళి – ఆకట్టుకోవడం కష్టమే..

సమీక్ష: గులేబకావళి – ఆకట్టుకోవడం కష్టమే..

Published on Apr 7, 2018 10:43 AM IST
Gulebakavali movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 6, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : ప్రభుదేవా, హన్సిక, రేవతి తదితరులు

దర్శకత్వం : కళ్యాణ్

నిర్మాతలు : మల్కాపురం శివకుమార్

సంగీతం : వివేక్ శివ, మెర్విన్ సోలమన్

సినిమాటోగ్రఫర్ : ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్

ఎడిటర్ : విజయ్ వేలుకుట్టి

స్క్రీన్ ప్లే : కళ్యాణ్

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం ‘గులేబకావళి’. కళ్యాణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగులో అదే పేరుతో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. బద్రి (ప్రభుదేవా) గులేబకావళి గుడిలో ఉన్న నిధిని దొంగిలించాలని డీల్ కుదుర్చుకుంటాడు. ఆ ప్రయాణంలో అతనికి హన్సిక, రేవతి, ఇంకొంతమంది కలుస్తారు. వాళ్లంతా కలిసి ఆ నిధిని ఎలా దొంగిలించారు, ఎలా దాన్ని కాపాడుకున్నారు అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రభుదేవా నటన బాగుంది. వన్ మెన్ షో లాగ ప్రభుదేవా ఒక్కడే దాదాపు సినిమాను నడిపించడం జరిగింది. సినిమా మొత్తం డీసెంట్ గా కనిపిస్తూ మంచి కామెడీతో పాటు తన డ్యాన్సులతో ఆకట్టుకున్నాడు. రేవతి పాత్ర సినిమాకు మరో ప్రతేక ఆకర్షణ. ఆమె చేసే చిన్న చిన్న ట్రిక్కులు, పండించిన కామెడీ ఆకట్టుకున్నాయి.

హన్సిక, ప్రభుదేవా మద్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. హన్సిక పాటల్లో బాగా కనిపించింది. తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. యధా విధిగా బాగానే చేసింది. యోగిబాబు, రెహమాన్ ల కామెడీ కొన్ని చోట్ల నవ్వించింది. సినిమా సెకండాఫ్ ఫస్టాఫ్ కంటే కొంత బెటర్ గా అనిపించింది.

మైనస్ పాయింట్స్ :

ఓవర్ గా అనిపించిన కామెడీ సినిమాకు ప్రధాన మైనస్. అనువాద చిత్రం కావడం వలన కథనం, సంభాషణల్లోని కామెడీలో ఆ సెన్సిబిలిటీ లోపించింది. సినిమాలో తమిళ ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉండటం కూడ తెలుగు ప్రేక్షకులకు అంతగా సరిపడదు.

బాగుందనిపించే మొదటి పది నిముషాల తర్వాత చాలా అనవసరమైన సన్నివేశాలు వచ్చి సినిమా ట్రాక్ తప్పుతుంది. చాలా సినిమాల్లో మనం చూసిన సన్నివేశాలు, పాత్రలే ఈ సినిమాలో కూడ మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఆయా అనవసరపు సీన్ల మధ్యలో వచ్చే కామెడీ అయితే మరింత చికాకు పెడుతుంది.

సినిమాకు మరో పెద్ద మైనస్ దర్శకత్వం. డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా చెప్పడానికి తడబడినట్లు తెలుస్తోంది. కథ నిధి వేటకు సంబందించినదైనపుడు సినిమాలో ఆసక్తికరమైన మలుపులు, సన్నివేశాలు ఉండాలి కానీ ఇందులో అనవసరానికి కించన కామెడీ, అవసరంలేని సీన్లు ఉండటంతో అసలు పాయింట్ పక్కదారి పట్టి ప్రేక్షకుడికి బోర్ ఫీలింగ్ కలిగించారు.

సాంకేతిక వర్గం:

సినిమాలో సంగీతం పెద్దగా లేదు, పాటలు గొప్పగా లేవు, నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు పరువాలేదు. మొదటి సగంలో చాలా సన్నివేశాలను కట్ చేయాల్సింది. ఎడిటింగ్ వర్క్ గొప్పగా లేదు. డైరెక్టర్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఈ సినిమాలో ఆయన వర్క్ సాధారణంగానే ఉంది. చెప్పుకోనేంతగా గొప్పా ఏమీ లేదు. కొద్దిగా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బాగుండేది. ప్రభుదేవా, హన్సిక వంటి వారు ఉన్నా వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో ఆయన విఫలమయ్యాడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

అనవరసరమైన కామెడీ ఎక్కువగా కలిగిన ఈ చిత్రం ప్రేక్షకుడ్ని పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు. ప్రభుదేవా పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, కొంత బాగుందనిపించే సెకండాఫ్ ఇందులో కొంత ఇంప్రెస్ చేసే అంశాలు కాగా మొదటి పది నిముషాల తర్వాత ట్రాక్ తప్పిన ప్రధానాంశం, నీసరసంగా సాగిన కథనం, అందులోని అనవసరమైన సన్నివేశాలు, సినిమా తెలుగు నేటివిటీ కొద్దిగా కూడ దగ్గరగా లేకపోవడం వంటి అంశాలు కలిసి సినిమా ఫలితాన్ని తలకిందులు చేశాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ సినిమాను థియేటర్లో చూడటం కన్నా టీవీల్లో వేసినప్పుడు చూడటం బెటర్.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు