బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పైగా ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఇటీవల జెన్‌జీపై చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కంగనా ట్రోలర్స్‌పై మండిపడుతూ ఇన్‌స్టా స్టోరీలో ఘాటుగా స్పందిస్తూ.. ‘నేను నటించడానికి రూ.కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని ఆయా చిత్రాల్లో పాత్రలు పోషించాను.
అలాంటి వాటిని ఉదాహరణగా చూపిస్తూ.. రోడ్లమీద, ఫంక్షన్‌లలో కూడా టీనేజర్లు అలాగే ప్రవర్తించడం తప్పు. అయినా, నటిగా నా వృత్తికి తగ్గట్లుగా అనేక పాత్రల్లో నటిస్తాను. ఈ విషయంలో నేను సిగ్గుపడాల్సింది ఏమీ ఉంది ?, దయచేసి అలాంటి పోలికలతో యువత తప్పుదోవ పట్టొద్దు, అలాగే యువతని తప్పుదోవ పట్టించవద్దు’ అని కంగనా తెలిపింది. సహజంగా విమర్శలు చేసే అలవాటు ఉన్న కంగనా.. ఇలాంటి కామెంట్స్ చేయడంతో.. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


