సమీక్ష : జిస్మ్ 2 – బోరింగ్ చిత్రం

సమీక్ష : జిస్మ్ 2 – బోరింగ్ చిత్రం

Published on Aug 3, 2012 4:10 PM IST
విడుదల తేది : 03 ఆగస్ట్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 1.5/5
దర్శకుడు : పూజ భట్
నిర్మాత : డినో మోరియ, పూజ భట్
సంగీత దర్శకుడు:పి. ముఖర్జీ,మిథూన్
తారాగణం : సన్నీ లియోన్,రన్దీప్ హుడా, అరుణోదయ్ సింగ్


జిస్మ్ 2 చిత్రం విడుదలకి సిద్దమయినప్పటి నుండి భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో సన్నీ లియోన్ ఉండటం, ప్రోమోలలో ఘాటయిన సన్నివేశాలు చూపించడం ఈ చిత్రం మీద అంచనాలను మరింత పెంచాయి. పూజా భట్ ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. జిస్మ్ 2లో రన్దీప్ హుడా మరియు అరుణోదయ్ సింగ్ లు సన్నీ లియోన్ సరసన ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

కథ:
ఇజ్న (సన్నీ లియోన్) ఒక అడల్ట్ యాక్ట్రస్ ఈమెని కబీర్ (రన్దీప్ హుడా) మోసం చేస్తాడు. మోసపోయిన ఇజ్న చనిపోవాలని అనుకుంటుంది అప్పుడు స్పెషల్ ఏజెంట్ ఆయన (అరుణోదయ్ సింగ్) ఆమె ప్రయత్నాన్ని ఆపి దేశం కోసం పని చెయ్యమని కోరుతాడు. ముందు ససేమిరా ఒప్పుకొని ఇజ్న తరువాత ఒప్పుకుంటుంది. వీరు ఇద్దరు కలిసి కబీర్ ని అంతమొందించడానికి ప్రణాళిక వేస్తారు.

చిత్రం కబీర్ నివసిస్తున్న శ్రీ లంక కి మారుతుంది. ఇజ్న తిరిగి కబీర్ జీవితంలోనికి మెల్లగా ప్రవేశిస్తుంది కబీర్ సంశయించి పూర్తిగా తనిఖీలు చేస్తాడు ఎటువంటి ఆధారం దొరకకపోవడంతో ఆమెని తన జీవితంలోనికి ఆహ్వానిస్తాడు. కబీర్ ఇజ్న ని నమ్మడం మొదలెట్టాక కథలోకి మోసం, అనుమానం మరియు ఈర్ష్య అనే అంశాలు ప్రవేశిస్తాయి. ఇజ్న నిజంగా ఎవరిని ప్రేమించింది? కబీర్ నిజంగా ఇజ్నని ప్రేమించాడా? ఆయన ఏమయ్యాడు? అనే అంశాలు మిగిలిన కథ.

ప్లస్:
ఈ చిత్రంలో కనిపించిన మూడు ప్రధాన పాత్రలు ఆకర్షణీయమయిన దేహాన్ని కలిగి ఉన్నారు. ఈ చిత్రంలో నాకు కనిపించిన ఒకే ఒక పాజిటివ్ అంశం ఇది ఒక్కటే. సన్నీ లియోన్ కొన్ని సన్నివేశాల్లో ఆకర్షణీయంగా కనిపించింది చిత్రంలో చూపెట్టిన లోకేషన్లు చాలా బాగున్నాయి.

మైనస్ :

ఈ చిత్రంలో చాలా తప్పులు కనిపిస్తాయి కనిపించిన ప్రతి నటుడి ప్రదర్శన బాగోలేదు ఎంతో ప్రతిభ కల రన్దీప్ హుడా కూడా అందరిలానే తను అనుకున్నారేమో ప్రేక్షకులను తనవంతు కష్టం తను పెట్టాడు. సన్నీ లియోన్ కి నటన రాదు, ఆమె ఏడుస్తున్నప్పుడు థియేటర్లో జనం కూడా ఏడుస్తారు అంతలా కృత్రిమంగా అనిపిస్తుంది ఆ నటన. మాములుగా ప్రతిభ కల నటుడయిన రన్దీప్ హుడా చిత్రం ఆసాంతం ఏం చెయ్యలేకపోయాడు. ఈ చిత్రం పరాజయం చవి చూస్తుంది అని ముందే తెలిసినవాడిలా జీవం లేని హావభావాలను పలికించాడు. అరుణోదయ్ సింగ్ కి ఎక్కడ ఏడవాలో ఎక్కడ అరవాలో అసలు తెలియనట్టు ఉంది.”కథ” ఈ చిత్రంలోని కథను కథ అని కూడా అనలేము. పూజ భట్ మరియు మహేష్ భట్ కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను అనుకోని వాటి మధ్య నింపడానికి మరి కొన్ని సన్నివేశాలను రాసుకున్నట్టు అనిపిస్తుంది. చిత్రంలో చెప్పుకోదగ్గ హాట్ సన్నివేశాలు కూడా లేవు. ఘాటయిన చుంబన దృశ్యాలు మినహా ఈ చిత్రంలో చెప్పుకోడానికి ఏమి లేదు. చాలా వరకు సన్నివేశాలు ముందే పసిగట్టేయగలం ఇదే కాకుండా సన్నివేశాల సాగతీత ప్రేక్షకుడిని నిద్రించేలా చేస్తాయి.

సాంకేతిక అంశాలు :

నిగం బొంజాన్ సినిమాటోగ్రఫీ మాత్రమే చిత్రంలో చెప్పుకోదగ్గ అంశం. విజువల్స్ మరియు లొకేషన్లను చాలా అందంగా చూపించారు. అసలే బాలేని స్క్రీన్ప్లే కి ఘోరమయిన ఎడిటింగ్ తోడయ్యి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరవాలేదనిపించాగా పాటలు చెప్పుకునే స్థాయిలో లేవు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

దర్శకురాలిగా పూజ భట్ విఫలమయ్యారు. ఈ చిత్రం నవ్వుల పాలయ్యింది అని చెప్పుకోవచ్చు.

తీర్పు :

జిస్మ్ 2 అసలు బాలేని చిత్రం. చిత్రం మీద ఉన్న అంచనాలు మరియు సన్నీ లియోన్ సృష్టించిన అంచనాలు ఈ చిత్రానికి కొంత వరకు తోడ్పడతాయి అంతకు మించి ఈ చిత్రం గురించి చెప్పుకోడానికి ఏమి లేదు. జిస్మ్ 2 చిత్రాన్ని చూడకుండా ఉండటమే మంచిది. మీరు సన్నీ లియోన్ కి వీరాభిమాని అయితే ఈ చిత్రం కాకుండా వేరే మార్గాలను ఎంచుకోవడం మంచిది.

123telugu.com Rating : 1.5/5

Translated by Ravi.

Click Here For Jism 2 English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు