సమీక్ష : మైత్రి -థ్రిల్లింగ్గా అనిపించని థ్రిల్లర్

సమీక్ష : మైత్రి -థ్రిల్లింగ్గా అనిపించని థ్రిల్లర్

Published on Nov 30, 2012 3:30 PM IST
విడుదల తేదీ: 30 నవంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5
దర్శకుడు : సూర్య రాజు
నిర్మాత : రాజేష్ కుమార్
సంగీతం : వికాస్
నటీనటులు : నవదీప్, సదా, బ్రహ్మానందం

తెలుగులో విజయం కోసం ఉవ్విళ్ళూరుతున్న సదాఫ్ మరియు పరిశ్రమలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నవదీప్ కలిసి నటించిన “మైత్రి” ఈరోజు విడుదలయ్యింది. సూర్య రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ కుమార్ నిర్మించారు.వికాస్ సంగీతం అందించారు. థ్రిల్లర్ తరహాలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

కథ :

డైరెక్టర్ అవ్వాలని ఆశయంతో ఉండే యువకుడు దీపు(నవదీప్), తనతో పాటు సినిమాటోగ్రాఫర్ అవ్వాలన్న ఆశయంతో చిత్రం శ్రీను మరియు ప్రొడక్షన్ మేనేజర్ గా ఉత్తేజ్ కలిసి పరిశ్రమలో ప్రయత్నాలు చేస్తుంటారు. హను టీవీ ఓనర్ అయిన మూర్తి(బ్రహ్మానందం) వీరితో ఒక ఆల్బం నిర్మించడానికి సిద్ద పడతారు. ఆల్బం షూటింగ్ కోసం ఊరి చివర ఒక బంగ్లా ను అద్దెకు తీసుకుంటారు. షూటింగ్ జరుగుతుండగా ఆ బంగ్లా ఓనర్ అయిన మైత్రి(సదాఫ్) అక్కడికి వస్తుంది. మైత్రిని చుసిన దీపు ఈ ఆల్బంలో నటించడానికి ఆమెని ఒప్పిస్తాడు. ఇలా షూటింగ్ జరుగుతుండగా బంగ్లాలో కొన్ని విచిత్రమయిన సంఘటనలు జరుగుతుంటాయి. అసలు ఆ సంఘటనలు జరగడానికి కారణం ఎవ్వరు? ఆ సంఘటనల మూలాన మైత్రి ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? అందులోనుండి ఎలా బయటపడింది అన్నదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

చిత్రంలో ఎం చెప్పాలనుకున్నారో క్లారిటి లేకపోయినా ఏదో చెప్తున్నాం అన్నంత సీరియస్ గా నవదీప్ మరియు సదాఫ్ నటించారు. సన్నివేశానికి బలం లేకపోయినా వీరిద్దరి నటన కాస్త బలాన్నిచ్చింది అనే చెప్పాలి. ముఖ్యంగా నవదీప్ చాలా స్టైలిష్ గా కనపడటమే కాకుండా పరిపక్వత కూడిన నటన ప్రదర్శించారు మైత్రి పాత్రలో సదాఫ్ కూడా అంతే స్థాయికి ఆకట్టుకుంది ఉత్తేజ్ నటన బాగుంది. సుమన్ శెట్టి ,బ్రహ్మానందం, సుభాషిణి, సత్యం రాజేష్ వారి పాత్రల మేరకు పరవాలేధనిపించారు. “ఆరారా పెదవే” పాట సి క్లాసు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

మైనస్లు అంటే చాలానే చెప్పుకోవచ్చు. పైన చెప్పిన కథ మొత్తం మొదటి అర్ధ భాగంలో మొదటి పది నిమషాలు మరియు క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రమే. ఏ సన్నివేశానికి ప్రాముఖ్యత లేదు థ్రిల్లింగ్ గా ఒక్క సన్నివేశం లేదు. పోనీ హారర్ అనుకుందామా అంటే అదీ కాదు. చిత్రంలో లాజిక్ గురించి మాట్లాడకపోవడమే మంచిది. కథ ప్రకారం ఆల్బం మొత్తం బంగ్లాలో చిత్రీకరించారు తీరా చివర్లో పాట చూపించినప్పుడు బ్యాక్ డ్రాప్లో రామోజి ఫిలిం సిటీ ఎలా వచ్చిందో దర్శకుడికే తెలియాలి. చిత్రంలో అనవసరమయిన సన్నివేశాలే ఉన్నాయి, బ్రహ్మానందం కామెడి కూడా సరిగ్గా రాలేదు.

ఒక థ్రిల్లర్ లో ఉండాల్సిన సస్పెన్స్ ని క్రియేట్ చెయ్యడంలో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యారు. మొదటి అర్ధ భాగం అయ్యాక చిత్రంలో ఏముంది? అన్న ప్రశ్నకు “ఆ ఏముంది?” అన్న ప్రశ్నే సమాధానం అవుతుంది. చిత్రంలో చాలా చోట్ల “మంత్ర” చిత్రం ఛాయలు కనిపిస్తుంది. కథనంలో చాలా ప్రశ్నలకు అసలు సమాధానమే చెప్పలేదు. ఒక్కోసారి వింతగా ప్రవర్తించే సదాఫ్ ఎందుకలా ప్రవర్తిస్తుందని చెప్పకపోవడమే సస్పెన్స్ అని దర్శకుడు అనుకున్నారేమో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడే ఆపేయటం శ్రేయస్కరం.

సాంకేతిక అంశాలు :

సెల్వ కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ పరవాలేదు అనిపించారు. ముఖ్యంగా సదాఫ్ ని చాలా అందంగా చూపించారు. రెండు పాటల్లో ఈయన కెమెరా పనితనం చాలా బాగుంది. ఎడిటింగ్ విభాగంలో వినయ్ బాగాలేని సన్నివేశాలను కత్తిరిస్తే చిత్రం ఏం ఉండదు అని గ్రహించినట్టున్నారు కత్తిరించాల్సిన చాలా సన్నివేశాలను అలానే ఉంచేశారు. జంప్స్ మరియు కట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి మొత్తానికి ఎడిటింగ్ విభాగం ఇంకా చాలా బాగా ఉండాల్సింది. ఇలాంటి చిత్రాలకు కీలకమయిన నేపధ్య సంగీతం విషయంలో వికాస్ దారుణంగా విఫలమయ్యారు పాటల్లో రెండు పాటలు మాత్రం చిత్రీకరణ కూడా బాగుండటంతో పరవలేధనిపించాయి.

కథ,కథనం,డైలాగ్స్ మరియు దర్శకత్వ విభాగాలని సూర్య రాజు ఒక్కడే చూసుకున్నారు ఇందులో కథ విషయానికి వస్తే పైన చెప్పినట్టు చెప్పుకోడానికి కథంటూ లేదు, హారర్ చిత్రాలకు ప్రాణమయిన కథనం విషయం అయితే అసలు మొదటి అర్ధ భాగం మొత్తం లేకపోయినా చిత్రంలో మార్పు ఉండదు అంటే కథనం ఎలా ఉందో తెలిసిపోతుంది. డైలాగ్స్ పెద్ద గొప్పగా ఏం లేదు. ఉత్తేజ్ పాత్రతో ప్రొడ్యూసర్ బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి అని చెప్పించిన దర్శకుడికి థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు గురించి ఆలోచించకపోవడం ఏంటో? దర్శకుడిగా కూడా పెద్ద ప్రతిభ ఏం కనబరచలేదు చిత్రం కోసం తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు ఈ చిత్రంలో కనిపించదు. సాహిత్య సాగర్ రాసిన “మేడ్ ఇన్ ఇండియా” పాట చూడటానికి మరియు వినడానికి కూడా బాగుంది.

తీర్పు :

థ్రిల్లర్ లేదా హారర్ అని అనుకోని ఈ చిత్రానికి వెళ్తే మీకు దొరికేది ఏం ఉండదు. పోనీ అది కాకుండా ఇంకేమయిన ఉందా ఈ చిత్రంలో అంటే నవదీప్ మరియు సదాఫ్ ల నటన, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బాగున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాలు పెట్టుకొని ఈ చిత్రానికి వెళ్ళేంత విషయం అయితే లేదు. మొత్తానికి ఈ చిత్రం థ్రిల్లింగ్ గా అనిపించని థ్రిల్లర్, భయపెట్టని హారర్ సినిమాకి వెళ్ళిన వారికి టెర్రర్.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

రవి

Click Here For ‘Mythri’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు