అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ కొనసాగుతోంది. అఖిల్ చిత్తూరు డైలాగ్ డెలివరీతో ఈ సినిమాలో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఐతే, ఘాట్ ఇంకా బ్యాలెన్స్ ఉందని.. అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా పై మాత్రం మంచి హైప్ ఉంది.


