సమీక్ష : పోటుగాడు – టైం పాస్ మూవీ..

సమీక్ష : పోటుగాడు – టైం పాస్ మూవీ..

Published on Sep 15, 2013 7:15 AM IST
 Potugadu-Latest-Posters-1 విడుదల తేదీ14 సెప్టెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : పవన్ వడియార్
నిర్మాత : శిరీషా – శ్రీధర్
సంగీతం : అచ్చు 
నటీనటులు : మంచు మనోజ్, సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్ ముండి, అను ప్రియ గోయెంక, రేచల్..

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘గోవిందాయ నమః’ సినిమాకి రీమేక్ గా మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పోటుగాడు’. ఈ రోజు భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమాలో సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్ ముండి, అను ప్రియ, రేచల్ లు హీరోయిన్స్ గా ఆడిపాడారు. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన పవన్ వడియార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శిరీషా – శ్రీధర్ నిర్మించారు. ఇప్పటికే అచ్చు అందించిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి థియేటర్స్ లో మన మంచు మనోజ్ పోటుగాడు అని అనిపించుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

గోవిందు(మంచు మనోజ్) జీవితంలో బతకాలనే కోరిక చచ్చిపోయి, చనిపోవాలని నిర్ణయించుకొని ఒక ప్లేస్ ఎంచుకుకుంటాడు. అదే ప్లేస్ కి వెంకటరత్నం(పోసాని కృష్ణమురళి) కూడా చనిపోవడానికి వస్తాడు. అక్కడ ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ ఒకరికొకరు తాము ఎందుకు చనిపోతున్నామో చెప్పుకోవడం మొదలు పెడతారు. వెంకటరత్నం మాత్రం లవ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవాలనుకుంటాడు. గోవిందు కూడా అదే రీజన్ తో చనిపోవాలనుకుంటాడు కానీ అక్కడే ఓ ట్విస్ట్..

ఎందుకంటే మన గోవిందుకి ఒక్కటి కాదు నాలుగు లవ్ స్టొరీలు ఉంటాయి. మొదటి లవ్ ట్రాక్ వైదేహి(సిమ్రాన్ కౌర్ ముండి)తో, రెండవ లవ్ ట్రాక్ ముంతాజ్(సాక్షి చౌదరి)తో, మూడవ లవ్ ట్రాక్ స్టేసీ (రేచల్)తో, చివరిది నాలుగవ లవ్ పార్ట్ మేరీ (అనుప్రియ గోయెంక)తో జరిగి ఉంటుంది. కానీ గోవిందు ఏ ఒక్క లవ్ లోనూ సక్సెస్ అయ్యి ఉండడు. ఈ నాలుగు లవ్ ట్రాక్స్ లో గోవిందు ఎందువల్ల ఒక్కో అమ్మాయిని వదులుకోవలిసి వచ్చింది? అందరినీ అతనే దూరం చేసుకున్నాడా? లేక వాళ్ళే అతన్ని మోసం చేసారా? చివరికి ఈ నలుగురిలో ఏ ఒక్కరితో అయినా మన గోవిందు సెటిల్ అయ్యాడా? లేదా? అనేదే ఈ చిత్రంలోని మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

మంచు మనోజ్ మరియు పోసాని కృష్ణమురళిలు ఈ సినిమా మొత్తాన్ని తమ భుజాలపై వేసుకొని నడిపించారు. ముందుగా.. మంచు మనోజ్ నటన, డైలాగ్ డెలివరీ బాగుంది. అలాగే మనోజ్ ఎంతో రిస్క్ తీసుకొని చేసిన స్టంట్స్ కూడా చాలా బాగున్నాయి. పోసాని కృష్ణమురళి తన డైలాగ్ డెలివరీతో స్క్రీన్ పైన కనిపించినంత సేపూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. అతని లవ్ స్టొరీ ట్రాక్, అందులో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. అలాగే మనోజ్ – పోసాని కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి.

సినిమాలో నటించిన హీరోయిన్స్ అందరివీ చిన్న చిన్న పాత్రలు. వారందరూ రెండు మూడు సీన్స్, ఒక్కో పాటకి పరిమితమయ్యారు. సాక్షి చౌదరి బాగుంది, స్టేసీ పాత్ర చేసిన రేచల్ అందాల ఆరబోతతో బాగానే ఆకట్టుకుంది, అనుప్రియ జస్ట్ ఓకే. ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సాగుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమాకి అచ్చు అందించిన సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయి. అదే పాటల్ని తెరపై అంత కన్నా సూపర్బ్ గా చిత్రీకరించారు. పాటలు చూడటానికి చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘దేవత’, ‘ప్యార్ మే పడిపోయా’ సాంగ్స్ మరియు ‘బుజ్జి పిల్ల’ పాటలో స్విమ్మింగ్ పూల్ లో తీసిన షాట్స్ చాలా బాగా వచ్చాయి. అలీ, రఘుబాబులు కొద్దిసేపే కనిపించినా పరవాలేధనిపించారు. ఇంటర్వల్ బ్లాక్ బాగుంది, అలాగే సినిమా రన్ టైం తక్కువ కావడం సినిమాకి హెల్ప్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి అర్ధ భాగం సాగినంత వేగంగా సెకండాఫ్ సాగదు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కూడా కాస్త తక్కువైంది. అలాగే సినిమా క్లైమాక్స్ చాలా రొటీన్ గా, ఊహాజనితంగా ఉండడం వల్ల ఆడియన్స్ నిరుత్సాహపడే అవకాశం ఉంది. సిమ్రాన్ నటన బాలేదు. సెకండాఫ్ లో వచ్చే రేచల్ ట్రాక్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోదు. అలాగే ఇంగ్లీష్ బ్యూటీ రేచల్ తెలుగులో మాట్లాడటం చిరాకు పెడుతుంది. ఇకనైనా ఫిల్మ్ మేకర్స్ అలా చేయడం మానుకుంటే బెటర్.

సినిమాలో నటించిన నలుగురు హీరోయిన్స్ తెలుగు వారు కాకపోవడం వల్ల వారి నటన పరవాలేధనిపించినా డైలాగ్ డెలివరి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అలాగే హీరోయిన్స్ తో మనోజ్ రొమాంటిక్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. సినిమా మొత్తం చూసాక కథా పరంగా చూసుకుంటే సినిమాలో పెద్ద కథేం లేదే అన్న భావన కలుగుతుంది. అలాగే చివరి లవ్ ట్రాక్ లో వచ్చే మేరీ పాత్రకి, చంద్ర మోహన్ పాత్రలకి సరైన ముగింపు ఇవ్వలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మొదటగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ గురించి, సినిమా మొదటి ఫ్రేం నుంచి చివరి ఫ్రేం వరకూ ఆయన అందించిన సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. అలాగే అచ్చు అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. చాలా చోట్ల డబుల్ మీనింగ్ కామెడీ డైలాగ్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటర్ ఎంఆర్ వర్మ సెకండాఫ్ విషయంలో కాస్త కేర్ తీసుకొని తన కత్తెరతో కొన్ని అనవసర సీన్స్ ని కట్ చేసి ఉండే సెకండాఫ్ కి హెల్ప్ అయ్యేది కానీ చేసినంతవరకూ బాగుంది.

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం ఈ మూడు విభాగాలను పవన్ వడియార్ డీల్ చేసాడు. కథ – చెప్పుకునేంత లేదు. స్కీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండాఫ్ ని ఇంకాస్త టఫ్ గా ఉండేలా చూసుకోవాల్సింది. డైరెక్షన్ – ఓవరాల్ గా పవన్ డైరెక్షన్ ఓకే. శిరీషా – శ్రీధర్ మూవీ కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై చాలా రిచ్ గా కనిపించింది.

తీర్పు :

మంచు మనోజ్ ‘పోటుగాడు’గా వచ్చి ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఫాస్ట్ గా నడిచే ఫస్ట్ హాఫ్ కి ఎంటర్టైన్మెంట్ తోడవడం, మంచు మనోజ్ – పోసాని కాంబినేషన్, సూపర్బ్ సినిమాటోగ్రఫీ, కాస్త హీరోయిన్స్ గ్లామర్ సినిమాకి ప్లస్ అయితే ఊహించినంత స్థాయిలో సెకండాఫ్, క్లైమాక్స్ లేకపోవడం ఈ సినిమాకి బిగ్ మైనస్. చివరిగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ సారి చూడదగిన సినిమా ‘పోటుగాడు’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు