అన్నతో నిహారిక సినిమా.. మినిమం గ్యారెంటీ ప్రాజెక్ట్!

అన్నతో నిహారిక సినిమా.. మినిమం గ్యారెంటీ ప్రాజెక్ట్!

Published on Mar 28, 2026 12:01 AM IST

vt16

మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోస్ లో ఫలితంతో సంబంధం లేకుండా మొదటి నుంచీ పలు వినూత్న ప్రాజెక్ట్ లతో వస్తున్న టాలెంటెడ్ హీరో వరుణ్ తేజ్. ఇప్పుడు కూడా కొరియన్ కనకరాజు అంటూ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో తను రాబోతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత తన కెరీర్ 16వ సినిమా కూడా ఇప్పుడు లాకయ్యింది.

సక్సెస్ లేడీ ప్రొడ్యూసర్ వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెల ఇప్పుడు తన పింక్ ఎలిపేంట్స్ బ్యానర్ పై వరుణ్ తేజ్ తో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యింది. కమిటీ కుర్రోళ్ళు ఇప్పుడు రాకాస సినిమాతో కూడా మంచి హిట్ వైబ్స్ ని సొంతం చేసుకున్న నిహారిక నెక్స్ట్ తన అన్నయ్యకు హిట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది అని చెప్పవచ్చు. వాలీబాల్ నేపథ్యంలో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ పోస్టర్ తో తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు ఈ ఏప్రిల్ 28న బయటకు రానున్నాయి.

తాజా వార్తలు