సమీక్ష : ఇంగ్లీష్ వింగ్లిష్ – శ్రీదేవి “రిటర్న్ బ్యాక్”

సమీక్ష : ఇంగ్లీష్ వింగ్లిష్ – శ్రీదేవి “రిటర్న్ బ్యాక్”

Published on Oct 5, 2012 2:15 PM IST
విడుదల తేదీ: 05 అక్టోబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ :4/5
దర్శకుడు : గౌరీ షిండే
నిర్మాత : సునీల్ లుల్ల, & ఆర్. బాల్కి
సంగీతం: అమిత్ త్రివేది
నటీనటులు : శ్రీదేవి, ప్రియా ఆనంద్

తెరకు దూరమయ్యే సమయానికి శ్రీదేవి భారతదేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన నటి. అందమే కాకుండా అభినయాన్ని పాత్రలకు ఆపాదించి చేసిన ప్రతి పాత్రకు జీవం పోసిన నటిగా శ్రీదేవిని చెప్పుకోవచ్చు. “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రంతో శ్రీదేవి తిరిగి తెర మీద కనిపించారు. సాధారణ గృహిణిగా ఈ చిత్రంలో కనిపించారు. మేకప్ లేకుండా అందం కన్నా అభినయనికే ఎక్కువ ఆస్కారమున్న పాత్రలో కనిపించారు. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

కథ:

శశి(శ్రీదేవి) సాదారణ గృహిణిగా జీవనం సాగిస్తూ ఉంటుంది. కాని వంట చెయ్యడంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. లడ్డూలు చెయ్యడంలో ఆమె సిద్ద హస్తురాలు. అలా చేసిన లడ్డులను అమ్మిఆమె కొంత మొత్తం సంపాదిస్తుంది. కాని తనకి వచ్చిన సమస్యల్లా తనకి ఇంగ్లీష్ చదవటం కాని రాయటం కాని రాదూ. తన కూతురు మరియు భర్త సతీష్(ఆదిల్ హుస్సేన్) ఈ విషయంలో ఆమెను ఆటపట్టిస్తూ ఉంటారు. శశి కూతురు అయితే పదే పదే ఆమెను కించపరుస్తూ మాట్లాడుతుంది.

అనుకోకుండా శశి తన అక్క కూతురి పెళ్లి కోసం అమెరికా వెళ్ళవలసి వస్తుంది. ఆమెకు వచ్చిన ఇంగ్లీష్ తో అక్కడ ఎలా గడపలో అని ఆమె ముందు భయపడిపోతుంది అక్కడికెళ్ళాక అక్కడి పరిస్థితులు ఆమెను మరింత భయపెడతాయి. అప్పుడే ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికీ తెలియకుండా ఆ శిక్షణ తీసుకోవడం మొదలు పెడుతుంది.

అదే శిక్షణ శిబిరంలో తనతో పాటు పలు దేశాల నుండి వచ్చిన వాళ్ళు చేరుతారు వాళ్ళతో స్నేహం ఆమె జీవితంలో చాలా మార్పు తీసుకొస్తుంది చిత్రం చివరికి వచ్చే సమయానికి ఇటు కుటుంబాన్ని అటు తన ఆశయాన్ని ఎలా బ్యాలెన్స్ చేసింది అనేది తెర మీద చూడాల్సిందే.

ప్లస్:

ముందుగా ఈ విభాగంలో చెప్పుకోవాల్సింది తమిళ సూపర్ స్టార్ “తలై” అజిత్ గురించి అప్పటి వరకు శ్రీదేవి చిత్రాన్ని పరిగేట్టిస్తుంటే అజిత్ కనిపించింది కాసేపే అయినా ఆ కాసేపట్లోనే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టారు. ఇంగ్లీష్ చిత్రాన్ని తెలుగులో అనువదించి చెప్పడం, ఇమిగ్రేషన్ వద్ద అయన చెప్పిన డైలాగ్ సినిమా ప్రధాన ఆకర్షణలలో చెప్పుకోవాల్సిన విషయాలు. (అజిత్ పాత్రను హిందీలో “అమితాబ్ బచ్చన్ చేశారు)

ఈ చిత్రానికి శ్రీదేవి ప్లస్ అని చెప్పలేము ఎందుకంటే ఈ చిత్రం, శ్రీదేవి నాకు వేరువేరుగా కనిపించలేదు శ్రీదేవే ఈ చిత్రం అనిపించింది. శశి పాత్రలో తన నటన గురించి చెప్పాలంటే నటించింది అనడం కన్నా ఒక గృహిణి ఎలా ఉంటుంది తెర మీద చూపించింది అని చెప్పుకోవడం సరయినది. చిత్రం మొదలయిన కొద్ది నిమిషాలలోనే ప్రేక్షకుడు ఆమె పాత్రకి కనెక్ట్ అయిపోతాడంటే ఆమె నటన గురించి అర్ధం అయిపోతుంది. సున్నిత మనస్తత్వం గల గృహిణి పాత్రలో ఆమె నటన అద్భుతం ఇంతకముందు చెప్పిన విధంగా ఈ చిత్రం మరియు శ్రీదేవి వేరు వేరు కాదు శ్రీదేవి లేకుండా ఈ చిత్రాన్ని ఊహించడం కూడా కష్టం అనేలా ప్రదర్శన ఇచ్చింది. ప్రతి శ్రీదేవి అభిమాని తృప్తి చెందే చిత్రం ఇది.

ఆదిల్ హుస్సేన్ శ్రీదేవి నటనకి మంచి సహాయం అందించారు. ప్రియ ఆనంద్ తన పాత్రకి సరిగ్గా సరిపోయింది అందంగా కనిపించడమే కాకుండా కీలక సన్నివేశాలలో తన అభినయం చాలా బాగుంది. చిన్న పిల్లాడు శివాన్ష్ కోటియా కూడా శ్రీదేవి కొడుకుగా పూర్తి మార్కులు కొట్టేసాడు. ఫ్రెంచ్ కుక్ పాత్రలో మెహ్ది నేబ్బౌ బాగా చేశారు. సల్మాన్ ఖాన్ పాత్రలో కనిపించిన సుమిత్ వ్యాస్ మరియు రామ మూర్తి పాత్రలో కనిపించిన రాజీవ్ రవి చంద్రన్ హాస్యాన్ని పండించడంలో సఫలం అయ్యారు.

ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు తమని తాము చూసుకోగలరు. అమ్మ లేదా అమ్మమ్మ ఇలా ఎవరో ఒకరు మన చుట్టూ శశి లాంటి మహిళా ఉంటారు. ఈ చిత్రానికి కథ ప్రధాన ఆకర్షణ మనవ సంభంధాలు గురించి చెప్పిన కథ అద్భుతంగా ఉంది. చిత్రంలో కనిపించిన ప్రతి పాత్రకు దాని ప్రత్యేకత ఉండటం మనలో ఒక పాత్రలా అనిపించడం ఈ చిత్రానికి ప్రధాన బలం.

చిత్రమంతా హాస్యంతో ఉన్నా క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. చీరలలో శ్రీదేవి “డ్రీం గర్ల్” రోజులను గుర్తు చేశారు. బహుశా ప్రస్తుతం అందరు గృహిణులకు ఆమె “డ్రీం లేడీ” కానుందేమో.

మైనస్ పాయింట్స్:

చెప్పుకోడానికి ఏది లేదు అంటే అతిశయోక్తి కాదేమో. నిజానికి ఈ చిత్రంలో చెప్పుకోడానికి పెద్ద మైనస్ లు ఏవి లేవి కమర్షియల్ అంశాలు కోరుకునేవారికి ఈ చిత్రంలో ఏం లేదనేది మాత్రమే మైనస్ గా చెప్పగలం.

సాంకేతిక అంశాలు :

ఈ చిత్రంలో డైలాగ్స్ చాలా బాగున్నాయి ఎడిటింగ్ చాలా బాగుంది అమిత్ త్రివేది అందించిన సంగీతం సన్నివేశాలను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. లక్ష్మణ్ ఉతేకర్ అందించిన సినిమాటోగ్రఫీలో న్యూ యార్క్ చాలా అందంగా కనిపించింది. దర్శకురాలిగా గౌరీ షిండే వందకి వంద మార్కులు కొట్టేసింది. చిత్రంలో ప్రేక్షకుడి లీనమయ్యేలా చెయ్యడంలో కథనాన్ని వేగంగా నడిపించడంలో భావోద్వేగాలను కదిలించేలా సన్నివేశాలు రచించడంలో పూర్తి మార్కులు కొట్టేసింది.

తీర్పు:

మంచి చిత్రాలు అప్పుడప్పుడే వస్తుంటాయి అలాంటి వాటిలో “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రం కూడా ఒకటి.శ్రీదేవి తన నటనతో చిత్రానికి ప్రాణం పోసింది. డైలాగ్స్ మరియు గుర్తుండిపోయే సన్నివేశాలు చిత్రం చూసిన వారికి అద్భుతమయిన అనుభూతిని ఇస్తుంది. “కమర్షియల్” చిత్రాలతో విసిగిపోయిన వారికి ఈ చిత్రం మంచి ఊరటనిస్తుంది. చివరిగా శ్రీదేవి గారికి తిరిగి తెర మీదకు స్వాగతం.

123తెలుగు.కామ్ రేటింగ్ : 4/5

(మహేష్ ఎస్ కోనేరు)
అనువాదం – రv

Click Here For ‘English Vinglish’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు