సమీక్ష : పోలీస్ గేమ్ – ​వృదా ప్రయత్నం

సమీక్ష : పోలీస్ గేమ్ – ​వృదా ప్రయత్నం

Published on Oct 4, 2013 11:00 PM IST
Police_Game విడుదల తేదీ : 04 అక్టోబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : సహా దేవా డివి
నిర్మాత : సుజాత దేవా
సంగీతం ఎం.ఎం శ్రీలేఖ
నటీనటులు : శ్రీహరి, నీను కార్తిక, నమిత

ఈ మద్య కాలంలో రియల్ స్టార్ శ్రీహరి ఎక్కువగా సహాయ నటుడి పాత్రల్లో మాత్రమే​ కనిపిస్తున్నాడు. తాజాగా ‘పోలీస్ గేమ్’ సినిమాలో ఆయన సోలో హీరోగా నటించడం జరిగింది. ఈ సినిమాలో కోట శ్రీనివాస రావు ఒక ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది. అలాగే మరికొంత మంది కొత్త నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ రోజు విడుదలైనది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
​​

​కథ : ​

​రాధా కృష్ణ (శ్రీహరి) ఒక నిజాయితీ పరుడైన పోలీస్ అధికారి. ఆయన నిజాయితీకి బహుమానంగా అతన్ని చాలా సార్లు సస్పెండ్ చేయడం జరుగుతుంది. డీజీపీ (కోట) అతనికి ఒక ముఖ్యమైన ఆపరేషన్ ని అప్పగిస్తాడు. ఆ ఆపరేషన్ పేరు ‘ఆపరేషన్ డ్రగ్ మాఫియా’. ఈ టాస్క్ ముఖ్య ఉద్దేశ్యం కొంతమని రాజకీయ నాయకుల పబ్ లలో డ్రగ్ అమ్ముతూ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్న వారిని పట్టుకోవడం.
అయితే డ్రగ్స్ కోసం, డబ్బుల కోసం ఈ చట్ట వ్యతిరేకమైన డ్రగ్ వ్యాపారాన్ని నలుగురు వ్యక్తులు నిర్వహిస్తూ వుంటారు. వారిలో ఒక వ్యక్తిని రాధా కృష్ణ చెల్లెలు సిరి ప్రేమిస్తుంది. కానీ అతనిని రాధా కృష్ణ గుర్తించ లేకపోతాడు.

ఈ సమస్యని రాధాకృష్ణ ఎలా పరిష్కరిస్తాడు. దానిని ఆపడానికి తను ఎటువంటి చర్యలు తీసుకున్నాడు? మరి రాదా కృష్ణ చెల్లెలు ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపిస్తాడా? ఇదంతా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :​

ఈ సినిమాలో శ్రీహరి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఈ సినిమా అతని వల్ల మాత్రమే సేవ్ చేయబడింది. కొన్ని సన్నివేశాలలో డైలాగ్స్ బాగున్నాయి. కోట శ్రీనివాస్ రావు, శ్రీహరి చెల్లెలిగా నటించిన అమ్మాయి నటన బాగుంది. ఈ సినిమా ద్వారా తెలియజేయాలనుకున్న మెసేజ్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

​స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదు. ఎక్కడ కూడా సన్నివేశాలు ఒక పద్దతిలో రావు. ​సినిమాలో ఎక్కువ సన్నివేశాలను చూస్తుంటే అవి సరిగా లేకపోవడంతో తరువాత వచ్చే సన్నివేశాలపై ఈ ప్రభావం పడింది. ​ఈ సినిమాలోని రెండు ‘ఐటమ్’ సాంగ్స్ చిత్రీకరించిన విదానం చాలా దారుణంగా ఉండడంతో చూసేవాడికి విసుగు పుట్టిస్తుంది.

ఎక్కువ మంది కొత్తవారు ఈ సినిమాలో నటించడం జరిగింది. వారి నటన గురించి చెప్పడానికి మాటల్లేవ్. ​​ఈ సినిమా మొత్తంలో ఎక్కడ కూడా లాజిక్ కనిపించకపోవడంతో ఆడియన్స్ కి చిరాకు వస్తుంది. ​సినిమాలో వచ్చే సన్నివేశా​లన్నీ​ మనం ముందే వుహించే విదంగా వుంటాయి. అలాగే ఇంటర్వల్ ట్విస్ట్ కూడా అంత పెద్దగా ​ఆకట్టుకోలేకపోయింది. ​

ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర వృదా అయ్యింది, ప్రేక్షకులను నవ్వించడంలో విఫలం అయ్యారు. హీరోయిన్ గా నమిత(కొత్త అమ్మాయి) నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాదాన్యం లేదు. ​​ఈ సినిమాలో ఆమె ఒక పోలీసు ఆఫీసర్ అయినప్పటికి ఎప్పుడు వేరే డ్రెస్ లలోనే కనిపిస్తువుంటుంది.

​క్లైమాక్స్ లో జరిగే ఫైట్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ​​ఈ సినిమాలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అని చెప్పుకోదగ్గ సన్నివేశం ఒక్కటి కూడా లేదు​.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి ఎంచుకున్న నటీనటుల సెలెక్షన్ అసలు బాలేదు. అది ఈ సినిమాకు పెద్ద మైనస్. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగోలేవు. మిగిలిన విభాగాలు కూడా అంత బాగోలేవు. ఈ సినిమాలో రెండు పాటలను చాలా చెత్తగా షూట్ చేశారు. వాటిని సినిమా నుండి పూర్తిగా తొలగించడం మంచిది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త పరవాలేదు. దర్శకత్వం అస్సలు బాగోలేదు. సినిమాటోగ్రఫీ మాములుగా ఉంది.

తీర్పు :

శ్రీహరి లాంటి ఓ మంచి నటున్ని ఇలాంటి సినిమాలో చూడటం కాస్త బాధాకరమైన విషయం. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కథ లేదు, మేచ్చుకునేంత ఎమోషన్స్ గానీ, సీన్స్ గానీ లేవు. ఈ సినిమాను థియేటర్స్ లో మరియు టీవీలో చూడటం కూడా వృధానే, ఎందుకంటే దీనివల్ల మీ సమయం వృధా అవ్వడం తప్ప ఉపయోగం ఏమీ లేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

రివ్యూ : కె పి కపిల్ రెడ్డి

అనువాదం : నగేష్

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు