సమీక్ష : ది డార్క్ నైట్ రైజస్ – ఒక అద్భుతానికి సరయిన ముగింపు

సమీక్ష : ది డార్క్ నైట్ రైజస్ – ఒక అద్భుతానికి సరయిన ముగింపు

Published on Jul 20, 2012 11:30 PM IST
విడుదల తేది : 20 జూలై 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.75/5
దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్
నిర్మాత : క్రిస్టోఫర్ నోలన్, చార్లెస్ రోవెన్
సంగీత దర్శకుడు: హేన్స్ జిమ్మర్
తారాగణం : క్రిస్టియన్ బాలే, మైఖేల్ కైన్, గ్యారీ ఓల్డ్ మాన్


బ్యాట్ మాన్ సిరీస్ లో చివరి చిత్రం “ది డార్క్ నైట్ రైజస్” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. ఈ చిత్రంలో క్రిస్టియన్ బాలే , మైకేల్ కైన్, అన్నే హతవే, మరియన్ కొటిల్లార్డ్, గ్యారీ ఓల్డ్ మాన్, మోర్గాన్ ఫ్రీమన్ మరియు టాం హార్డీ నటించారు. నేఫధ్య సంగీతాన్ని హన్స్ జిమ్మర్ అందించారు. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

కథ:
ముందే తెలిసినట్టుగా ఈ చిత్రం “ది డార్క్ నైట్” ముగింపు నుండి మొదలు అవుతుంది. గోతాం నగరంలో జరుగుతున్న అక్రమాలను డెంట్ సహాయంతో పోలీసు లు ముగిస్తారు తరువాత ఆ నగరంలో శాంతి నెలకొంటుంది. చాలా ఏళ్ళ వరకు బ్యాట్ మాన్ అవసరం ఆ నగరానికి రాకుండా పోతుంది. బ్రూస్ వైన్(క్రిస్టియన్ బాలే) కూడా అజ్ఞాతంలోకి వెళ్లి ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకుంటాడు.

నగరంలో నెలకొన్న శాంతికి తీవ్రవాద నాయకుడు బానే(టాం హార్డీ) భంగం కలిగిస్తాడు. కమీషనర్ (జిమ్ గోర్డాన్ ) అతని నుండి నగరాన్ని కాపాడమని బ్యాట్ మాన్ ని కోరుతాడు. బ్యాట్ మాన్ ఇప్పుడు అత్యంత శక్తివంతమయిన తెలివయిన శత్రువుని ఎదుర్కోవాల్సిన పరిస్థితి దీని కోసం తన పాత మిత్రుడు లుసిస్ ఫాక్స్ (మోర్గాన్ ఫ్రీమాన్) సహాయంతో బానే ని ఎదుర్కుంటాడు. అతనికి డిటెక్టివ్ బ్లేక్ సహాయం చేస్తాడు.

ఇద్దరు అమ్మాయిలు ఈ చిత్రంలో కనిపిస్తారు సెరెనా కైలె అకా కాట్ వుమెన్ (అన్న హతవే) మరియు మిరండ టేట్ (మారియన్ కొటిల్లార్డ్) బ్యాట్ మాన్ తో కలిసి పని చేస్తారు. బ్యాట్ మాన్ ఆ నగరాన్ని కాపాడ గలిగాడ? లేదా అనేది మిగిలిన కథ.

ప్లస్ :
ఈ చిత్రంలో అందరు నటులు అద్భుతమయిన ప్రదర్శన కనబరిచారు. బ్యాట్ మాన్ పాత్రలో క్రిస్టియన్ బాలే అద్భుతమయిన ప్రదర్శన ఇచ్చారు. కాట్ వుమెన్ పాత్రలో అన్నే హతవే తనదయిన శైలిలో అద్భుతమయిన ప్రదర్శన కనబరిచింది. మారియన్ కొటిల్లార్డ్ కథలో కీలక పాత్రకు తనవంతు న్యాయం చేసింది. తన ప్రదర్శన ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చింది. మోర్గాన్ ఫ్రీ మాన్ మరియు గ్యారీ ఓల్డ్ మాన్ మాములుగానే వారి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో అద్భుతమయిన విజువల్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. హాన్స్ జిమ్మర్ నేఫధ్య సంగీతంతో ప్రేక్షకులను కట్టి పడేశారు. గతంలో వచ్చిన చిత్రాలతో సంభంధం తెగిపోకుండా అద్భుతమయిన కథను అల్లుకున్నారు. ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా సన్నివేశాలను రాసుకున్నారు.

ఈ చిత్రంలో స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ అలరించే విధంగా ఉన్నాయి. బ్రూస్ వైన్ జైలు నుండి తప్పించుకునే సన్నివేశం అయితే థియేటర్ నుండి బయటకి వచ్చిన మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ చిత్రాన్ని ఐమాక్స్ లో చూస్తే మరింత అలరిస్తుంది.

మైనస్:

బానే నటన జోకర్ నటనతో సరితూగలేకపోయింది. జోకర్ పాత్రలో క్రూరత్వం ఈ పాత్రలో కుదరలేదు. టాం హార్డీ చిత్రం మొత్తం మాస్క్ వేసుకుని ఉంటారు గాత్రం కూడా డిజిటల్ గా వస్తుంది దీని వలన బానే హావ భావాలు సరిగ్గా కనిపించలేదు ఈ చిత్రం అక్కడక్కడ నెమ్మదించినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక అంశాలు:

బ్యాట్ మాన్ సిరీస్ లో చివరిగా వస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్టఫర్ నోలాన్ చాలా అద్భుతంగా తీశారు. దర్శకత్వం చాలా బాగుంది కానీ కొన్నిసందర్భాలలో స్క్రీన్ ప్లే ఇంకొంచెం క్లిష్టంగా ఉండుంటే బాగుండేది. హాన్స్ జిమ్మర్ సంగీతం మరియు వాలీ ఫిస్టర్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన హైలైట్. ఈ చిత్రంలోని డైలాగ్స్ గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాలి, డైలాగ్స్ చాలా డెప్త్ గా ఉండి తదుపరి సన్నివేశానికి బలాన్నిస్తాయి. ఎడిటింగ్ ఇంకాస్త ఆసక్త కరంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

తీర్పు :

చెప్పుకోవడానికి ఎలాంటి తప్పులు లేకుండా ‘ది డార్క్ నైట్ రైసెస్’ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలో బానే పాత్ర జోకర్ పాత్రంత అనిపించదు, ఈ ఒక్క విషయమే సినిమాలో కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ చిత్ర నేపధ్య సంగీతం, నటీనటుల అద్భుత ప్రదర్శన మరియు సూపర్బ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులని కచ్చితంగా సినిమాని మరోసారి చూసేలా చేస్తాయి. చాలా కాలం తర్వాత వస్తున్న బ్యాట్ మాన్ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు, కాబట్టి కుదిరితే ఈ అద్భుతమైన యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ ని ఐమాక్స్ స్క్రీన్ మీద చూడండి, చూసి మంచి అనుభూతికి లోనవ్వండి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.75/5

Click Here For ‘The Dark Knight Rises’ English Review

మహేష్ ఎస్ కోనేరు

(అనువాదం – రవి తేజ)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు