సమీక్ష : సూపర్ స్టార్ కిడ్నాప్ – ఈ కిడ్నాప్ జస్ట్ ఓకే.!

సమీక్ష : సూపర్ స్టార్ కిడ్నాప్ – ఈ కిడ్నాప్ జస్ట్ ఓకే.!

Published on Jul 4, 2015 2:40 PM IST
Superstar-Kidnap-review

విడుదల తేదీ : 03 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

నిర్మాత : చందు

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : నందు, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రద్ధ దాస్, భూపాల్..

యంగ్ యాక్టర్స్ నందు, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సూపర్ స్టార్ కిడ్నాప్’. హాట్ బ్యూటీ శ్రద్ధ దాస్ ఓ లేడీ డాన్ పాత్రలో కనిపించగా పూనం కౌర్ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. నూతన దర్శకుడు సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి చందు నిర్మాత. టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబుని కిడ్నాప్ చెయ్యడం కోసం ఓ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. మరి ఈ సినిమా ఎంతవరకూ ప్రేక్షకులను థ్రిల్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

సూపర్ స్టార్ కిడ్నాప్ సినిమా అనుకోకుండా ఓ సందర్భంలో కలిసిన ఓ ముగ్గురి యువకుల కథే ఇది. మొదటి వాడు – టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కుమారుడు జై(ఆదర్ష్ బాలకృష్ణ). చిన్నప్పుడే తల్లి చనిపోవడం వలన అన్ని బాధ్యతలు మరిచి డ్రగ్స్ కి అలవాటుపడతాడు. రెండో వాడు – నందు(నందు) ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి హాండ్ ఇవ్వడంతో తనని మళ్లీ ఎలా అయినా దక్కించుకోవాలి అనుకుంటాడు. మూడో వాడు – భూపాల్(భూపాల్) ఖుషి సినిమా చూసి డైరెక్టర్ ఆవుదాం అని వచ్చి డైరెక్టర్ గా ట్రై చేస్తుంటాడు. అనుకోకుండా ఓ సమస్యలో ఈ ముగ్గరు ఇరుక్కుంటారు. దాని నుండి బయటపడాలి అంటే వీరికి 50 లక్షల మనీ కావాలి.

దానికోసమే సూపర్ స్టార్ మహేష్ బాబుని కిడ్నాప్ చేసి తన నాన్ననే డబ్బు ఇమ్మని అడుగుదాం అని జై చెప్పిన ఐడియాకి మిగిలిన ఇద్దరూ ఒప్పుకుంటారు. ఇక కిడ్నాప్ కోసం మన ముగ్గురు హీరోలు వేసిన స్కెచ్ ఏంటి.? కింద పడి మీద పడి కిడ్నాప్ చేసిన తర్వాత వచ్చిన ట్విస్ట్ ఏంటి.?అనుకున్నట్టుగానే వీళ్ళు మహేష్ బాబుని కిడ్నాప్ చేసారా.? లేక ఇంకెవరినన్నా కిడ్నాప్ చేసారా.? ఆ కిడ్నాప్ వల్ల వారు ఎదుర్కున్న ఇబ్బందులు ఏమిటి.? అన్నది మీరు వెండి తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు యొక్క ట్యాగ్ లైన్ సూపర్ స్టార్ అనే పేరుని ఈ సినిమా టైటిల్ లో పెట్టుకోవడం మరియు సినిమాని సూపర్ స్టార్ కిడ్నాప్ చుట్టూ రాసుకోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మహేష్ బాబు పేరు తర్వాత చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్.. మంచు మనోజ్, అల్లరి నరేష్, నాని, తనీష్ లు చేసింది చిన్న చిన్న అతిధి పాత్రలే అయినప్పటికీ సినిమాకి చాలా పెద్ద బూస్టప్ అయ్యింది. వారి నాలుగు సీన్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. అలాగే సినిమా మొదలు పెట్టడమే బిజినెస్ మేన్ లాస్ట్ డైలాగ్(నీ ఎయిం 10 మైల్స్ అయితే ఎయిం ఫర్ 11థ్ మైల్)ని చూపించడం ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది. సినిమా మొదట్లో పాత్రలని పరిచయం చేసిన విధానం కూడా బాగుంటుంది. ఇంటర్వల్ బ్లాక్ లో మహేష్ బాబుని కిడ్నాప్ చేయాలనుకునే బ్లాక్ ఆసక్తికరంగా సాగుతుంది.

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు తెచ్చుకుంటున్న నందు, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్ లు మంచి నటనని కనబరిచారు. ఓ లవర్ బాయ్ గా నందు మంచి నటనని కనబరిచాడు. ఓ టాప్ సినీ నిర్మాత కొడుకుగా, డ్రగ్ అడిక్ట్ పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ బాగా నటించాడు. ముఖ్యంగా ఆ పాత్రకి కావాల్సిన మానరిజమ్స్ ని బాగా చూపించాడు. భూపాల్ తెలంగాణ కుర్రాడిగా, తెలంగాణా స్లాంగ్ లో అక్కడక్కడా నవ్వించాడు. ఓవరాల్ గా ఈ ముగ్గురు తమ పాత్రలకు న్యాయం చేసారు, అలాగే ఈ సినిమాలో వీరి పెర్ఫార్మన్స్ వారి కెరీర్ కి బాగా హెల్ప్ అవుతుంది. అందాల భామ శ్రద్ధ దాస్ లేడీ డాన్ గా బాగా సెట్ అయ్యింది. అలాగే నెగటివ్ షెడ్ ని పర్ఫెక్ట్ గా చూపించింది. కానీ ఈ పాత్రకి ఒరిజినల్ కథలో లింక్ లేకపోవడం వలన అప్పుడప్పుడు వచ్చి అలా కనపడి వెళ్ళిపోతుంది. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ ఉన్నంతసేపూ ప్రేక్షకులను బాగా నవ్వించాడు. పూనం కౌర్ ఓ పాట మరియు కొన్ని సీన్స్ లో టోటల్ మోడ్రన్ లుక్ లో అందాలను ఆరబోసి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొని వెళ్ళిపోయింది.

మైనస్ పాయింట్స్ :

సూపర్ స్టార్ కిడ్నాప్ మైనస్ లలో మొదటగా చెప్పుకోవాల్సింది.. సుశాంత్ రెడ్డి తన తొలి సినిమా కోసం రొటీన్ అయిన క్రైమ్ కామెడీలో ఓ సినిమాని సెలక్ట్ చేసుకోవడం. ఈ మధ్య కాలంలో ఇదే జానర్లో చాలా సినిమాలు వచ్చాయి. కావున కథ పరంగా పెద్దదా కిక్ ఏమీ ఉండదు. ఇకపోతే కథనం విషయంలో కూడా ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఎందుకు అంటే సినిమాలో ఉన్న ఒక్క ట్విస్ట్ ని సెకండాఫ్ మొదట్లో రివీల్ చేసేసాక తన దగ్గర చెప్పేదేమీ లేక అటు ఇటు కథని తిప్పుతూ ఉంటారు. అందువలన సెకండాఫ్ కాస్త బోర్ కొడుతుంది. మధ్యలో ఒక చేజ్ ఎపిసోడ్ ని షూట్ చేయకుండా యానిమేషన్ లో ట్రై చేసారు కానీ అది అస్సలు సినిమాకి హెల్ప్ అవ్వకపోగా, సినిమా లెంగ్త్ ని మరింత పెంచేసింది. సో కథనం విషయంలో డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఫ్లేవర్ ని సెకండాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయాడు.

ఇక ఓవరాల్ గా సినిమా నేరేషన్ మొదటి నుంచి చాలా స్లోగా ఉంటుంది. ఇలా నేరేషన్ స్లో అవ్వడం వలన సెకండాఫ్ మరింత ఊహాజనితంగా మారి అందరికీ బోర్ కొడుతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ని సరిగా రాసుకోలేదు. సందర్భానుసారంగా కామెడీ వస్తుందని ఆశించాడు కానీ అస్సలు కుదరలేదు. దాంతో కామన్ ఆడియన్ కోరుకునే కామెడీ కాస్త మిస్ అయ్యింది. పాటల ప్లేస్ మెంట్ సరిగా లేదు. చెప్పాలంటే ఆ సాంగ్స్ ని తీసేయ్యచ్చు. ముఖ్యంగా యానిమేషన్ పై వచ్చే సాంగ్. శ్రద్ధ దాస్, పోసాని లాంటి వారికి స్ట్రాంగ్ పాత్రలని రాసుకోలేకపోవడంతో ఆ పాత్రలకి పెద్దగా ఉపయోగమే లేదు అనే ఫీలింగ్ వస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చాలా డిపార్ట్ మెంట్స్ ది బెస్ట్ వర్క్ ఇచ్చారనే చెప్పాలి. ముఖ్యంగా ఈశ్వర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. స్టార్టింగ్ ఎంజాయ్ మెంట్ బ్లాక్, కిడ్నాప్ బ్లాక్, ఆ తర్వాత చేజింగ్ బ్లాక్ ఎపిసోడ్స్, మనోజ్ ఎపిసోడ్ ని చాలా బాగా చూపించాడు. ఇచ్చిన లో బడ్జెట్ లో ఇంతలా గ్రాండ్ విజువల్స్ ఇవ్వడం మెచ్చుకోదగిన విషయం. సాయి కార్తీక్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్ గ్ర్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా హెల్ప్ అయ్యింది. మధు జి రెడ్డి ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది. ఇంకాస్త షార్ట్ అండ్ స్పీడ్ గా ఎడిట్ చేసి ఉంటే సినిమాకి ఇంకాస్త హెల్ప్ అయ్యేది. డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి.

ఇక కథ – కథనం – దర్శకత్వం విభాగాలను డీల్ చేసి ఈ సినిమాకి కెప్టెన్ గా నిలిచింది సుశాంత్ రెడ్డి. కథ – ఓ సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేసి మనీ డిమాండ్ చెయ్యాలి అనేది కొత్త పాయింట్ ఏం కాదు. ఇంచు మించుగా ఇలాంటి పాయింట్స్ చాలానే వచ్చాయి. కానీ ఇందులో కథని ట్రీట్ చేసిన విధానం బాగుంది. కథనం – కథనంలో ఎక్కువ ట్విస్ట్ లు లేకుండా రాసుకున్నాడు. ఉన్న ఒక ట్విస్ట్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కథనం మీద ఇంకాస్త వర్కౌట్ చెయ్యాల్సింది. ఇక డైరెక్టర్ గా జస్ట్ పరవాలేదనిపించాడు.. నిర్మాత చందు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినా సినిమాలో ఆ ఫీలింగ్ ఎక్కడా కనిపించదు.

తీర్పు :

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో సూపర్ హిట్ ఫార్మాట్ గా ప్రూవ్ చేసుకున్న సస్పెన్స్, క్రైమ్ కామెడీ ఫార్మాట్ లో వచ్చిన సూపర్ స్టార్ కిడ్నాప్ కూడా ప్రేక్షకుల చేత పరవాలేదనిపించుకుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పేరునే కాకుండా, తనని కిడ్నాప్ చెయ్యడమే ఇతివృత్తంగా ఈ సినిమా నడవడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. డైరెక్టర్ రొటీన్ కథకి కొత్త నేపధ్యాన్ని జోడించినా అనుకున్న స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం వలన కాస్త సినిమా రేంజ్ తగ్గింది. మహేష్ బాబు పేరు, నటీనటుల పెర్ఫార్మన్స్, వెన్నెల కిషోర్ కొన్ని కామెడీ బిట్స్, మనోజ్, అల్లరి నరేష్, నాని, తనీష్ ల గెస్ట్ అప్పియరెన్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయితే రొటీన్ స్టొరీ లైన్, కథనం, నేరేషన్, ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. ఓవరాల్ గా ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ సినిమా చూసిన వారిచేత పరవాలేధనిపించుకుంటుందే తప్ప బాలేదు అని మాత్రం అనిపించుకోదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు