సమీక్ష : ‘తుపాకి’ పేలింది

సమీక్ష : ‘తుపాకి’ పేలింది

Published on Nov 14, 2012 1:02 AM IST
విడుదల తేదీ: 13 నవంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకుడు : AR మురుగదాస్
నిర్మాత : శోభ రాణి
సంగీతం : హరీష్ జైరాజ్
నటీనటులు : విజయ్, కాజల్ అగర్వాల్

విజయ్ తమిళ్లో సూపర్ స్టార్ కావొచ్చు కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ముందు వరకు అతను ఒక సాదాసీదా హీరోనే. స్నేహితుడు సినిమాతో తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేసాడు. కానీ ఆ సినిమా కూడా అతనికి నిరాశ మిగల్చగా మరోసారి తెలుగు ప్రేక్షకులని మెప్పించడానికి సిద్ధమయ్యాడు. విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా మురుగదాస్ డైరెక్షన్లో తమిళ్లో తెరకెక్కిన ‘తుపాకి’ సినిమాని తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసారు. ఈ సినిమా తెలుగు నిర్మాత శోభా రాణి భారీ రేటు పెట్టి తెలుగు పంపిణీ పంపిణీ హక్కులు దక్కించుకుంది. తమిళ్, తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదలైనప్పటికీ తెలుగు వర్షన్ రిలీజ్ విషయంలో జాప్యం జరిగి కొంత ఆలస్యంగా విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే..

కథ : జగదీష్ (విజయ్) ఆర్మీ ఆఫీసర్ సెలవుల సమయంలో ఇంటికి వస్తే అతని పేరెంట్స్ నిషా (కాజల్ అగర్వాల్) తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. ఒక వైపు వీరిద్దరి లవ్ ట్రాక్ నడుస్తుండగా మరోవైపు టెర్రరిస్టులు ముంబై నగరంలో ఒక చోట బాంబు పేలుస్తారు. ఆ సమయంలో జగదీష్ అక్కడే ఉండడం ఆ బాంబు పెట్టిన టెర్రరిస్టుని పట్టుకుని ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. (ఆర్మీ ఆఫీసర్ ఎంక్వయిరీ చేయడం అనే అనుమానం మీకు రావొచ్చు. జగదీష్ ఆర్మీలో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు). ఆ ఎంక్వయిరీలో టెర్రరిస్టులు ముంబై నగరాన్ని టార్గెట్ చేసి 12 చోట్ల బాంబులు పెట్టడానికి ప్లాన్ చేసినట్లు తెలుసుకుంటాడు. టెర్రరిస్టుల ప్లాన్, టెర్రరిజం ఎలా నాశనం చేసాడనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :
విజయ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాకపోవడానికి కారణం అతను చేసిన ఎక్కువ రీమేక్ సినిమాలే కావడం, స్ట్రైట్ సినిమాలు తక్కువ ఉండటం అంటూ రకరకాల కారణాలు ఉండేవి. ఈ సినిమాలో బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్ లెవల్స్ ఇలా చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాడు. విజయ్ కామెడీ టైమింగ్ కూడా బావుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో చూపించిన కాన్ఫిడెన్స్ అధ్బుతం. సినిమా చూస్తున్నంతసేపు విజయ్ ని కాకుండా జగదీష్ అనే ఆర్మీ ఆఫీసర్ మాత్రమే కనిపిస్తాడు. విజయ్ గత సినిమాల స్థాయిలో డాన్స్ చేయకపోయినా చిన్ని చిన్ని పులులం పాటలో డాన్స్ బాగా చేసాడు. కాజల్ అగర్వాల్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్న సీన్స్ వరకు బానే చేసింది. గూగుల్ గూగుల్ పాటలో అదరగొట్టింది. విలన్ విద్యుత్ జమ్వాల్ మైండ్ గేమ్ సీన్స్ బాగా చేసాడు. ఇంటర్వెల్ ముందు 12 మంది టెర్రరిస్టులని చంపే సీక్రెట్ ఆపరేషన్ ఎపిసోడ్ చాల బాగా తీసాడు దర్శకుడు. కిడ్నాప్ ఎపిసోడ్లో కూడా స్క్రీన్ ప్లే చాలా చాలా బావుంది. అన్ని ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ లో హీరో ఏం చేయబోతున్నాడు అని ఆలోచన చేసేంత టైం దర్శకుడు. హీరో వేసే ఎత్తు బావుందనుకోలేపే విలన్ అంతకుమించిన ఎత్తు వేస్తాడు. ఇవన్ని మైండ్ గేమ్స్ తో తీసినవి కావడంతో సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు పక్కకు తిరిగితే ఇంపార్టెంట్ సీన్ మిస్ అవుతామో అన్నంత ఆసక్తిగా చూసాడు. ఇలాంటి సినిమాలకి మైండ్ గేమ్ చాల ఇంపార్టెంట్. ఈ సినిమాలో దర్శకుడు హీరో, విలన్ మధ్య మైండ్ గేమ్ చాల బాగా ఆడుకున్నాడు. ప్రీ క్లైమాక్స్ సీన్స్ కూడా బావున్నాయి.

మైనస్ పాయింట్స్ : 

విజయ్, కాజల్ మధ్య రొమాంటిక్ సీన్స్ అంతగా పండలేదు. వారిద్దరి మధ్య సీన్స్ అన్ని కూడా సెపరేట్ రొమాంటిక్ ట్రాక్, సెపరేట్ కామెడీ ట్రాక్ లాగా ఉన్నాయి. వీటికి తోడు సాంగ్స్ టైమింగ్ సరిగా లేకపోవడం మైనస్. మాస్ ఆడియెన్స్ ఆశించే భారీ ఫైట్స్, డాన్సులు లేవు.

సాంకేతిక విభాగం :

మురుగదాస్, హారిస్ జైరాజ్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. కానీ ఈసినిమాలో హారిస్ జై రాజ్ సంగీతంలో క్యాచీ సాంగ్స్ లేకపోవడం బాధాకరం. నేపధ్య సంగీతం వరకు ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టాడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ కూడా బావుంది. విజయ్, కాజల్ మధ్య సీన్స్ కొన్ని కత్తెర వేస్తే బావుండేది లెంగ్త్ కూడా తగ్గేది. విజయ్ డబ్బింగ్ విషయంలో ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

తీర్పు :

విజయ్ సినిమా అంటే తెలుగు ఆడియెన్స్ కి చిన్న చూపు  ఉండేది. అతని సినిమాలు అతిగా ఉంటాయనే కంప్లైంట్ ఉండేది. ఈ సినిమాలో అది లేకపోవడం విశేషం. మురుగదాస్ డైరెక్షన్, బిగి సడలని స్క్రీన్ ప్లే, మైండ్ గేమ్ ఇలా ఒక హిట్ సినిమాకి కావాల్సిన అంశాలు అన్నీ ఉన్నాయి. తెలుగులో ఇప్పటి వరకు హిట్ లేని విజయ్ తుపాకితో అదరగొట్టి హిట్ కొట్టాడు.

123తెలుగు.కామ్ రేటింగ్ – 3.5/5

అశోక్ రెడ్డి .ఎమ్

Click Here For ‘Thuppaki’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు