పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గురించి ఒక కీలక అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో తమన్‌ను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడానికి ఎంపిక చేసినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ధృవీకరించింది. దీనితో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.
అయితే, ఈ మార్పు వెనుక దేవి శ్రీ ప్రసాద్‌కు, చిత్ర యూనిట్‌కు మధ్య ఎలాంటి క్రియేటివ్ విభేదాలు లేవని మేకర్స్ స్పష్టం చేశారు. కేవలం సమయాభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చిత్ర బృందం నిర్ణీత సమయానికి కంటెంట్‌ను డీఎస్పీకి పంపలేకపోవడం, అలాగే ఆయన ప్రస్తుతం ఇతర భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల, సినిమా పనుల్లో జాప్యం కలగకుండా ఉండేందుకు తమన్‌ను రంగంలోకి దించారు.
సినిమా విడుదలలో జాప్యం జరగకుండా ఉండేందుకే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన నోట్‌లో మేకర్స్ ఎక్కడా విడుదల తేదీని ప్రస్తావించనప్పటికీ, ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
Two stalwart musicians join hands for PSPK ❤🔥#UstaadBhagatSingh songs by @ThisisDSP & the background score by @MusicThaman are going to be a treat 💥💥
This will be a grand celebration and a lifetime memory for fans ❤️
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14… pic.twitter.com/060Vz0ONFK
— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2026


