‘లింగా’లో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న జగపతిబాబు

Jagapathi-Babu
‘లెజెండ్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఫ్యామిలీ హీరో ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల అన్ని సినిమాల్లో కీలక పాత్రల కోసం జగపతిబాబునే అప్రోచ్ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం జగపతిబాబు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నాడు.

అదికూడా రజినీకి పోటీ ఇచ్చే రేంజ్ లో ఉండే పవర్ఫుల్ పాత్ర పోషించానున్నాడని సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం ఈగ సుధీప్ ని అనుకున్నారు. కానీ డేట్స్ సమస్యలు రావడంతో జగపతిబాబుకి ఆ ఆఫర్ దక్కింది.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో మొదలు కానుంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Exit mobile version