
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రభస’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమాని ఆగష్టు 14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని జూలై 20న లాంచ్ చేయనున్నారు. కానీ ఎక్కడ, ఎంత గ్రాండ్ గా చేస్తారు అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇటీవలే రిలీజ్ చేసిన ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి కాగానే ఎన్.టి.ఆర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.