ఆనందంలో మంచు కుటుంబం

Manchu-Lakshmi
“రేపు మధ్నాహ్నం ఓ ముఖ్యమైన విషయాన్ని ప్రకటించబోతున్నా. నాకు, నా కుటుంబానికి అది చాలా ఆనందకరమైన వార్త” అంటూ నిన్న (14.06.) డా. మోహన్ బాబు తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆ వార్త దేని గురించి అయ్యుంటుందా? అని చాలామంది కొన్ని ఊహాగానాలు చేశారు. బహుశా మంచు మనోజ్ పెళ్లి గురించే మోహన్ బాబు ప్రకటించబోతున్నారని కూడా ఊహించారు. కానీ, ఆ ఊహలో నిజం లేదు. పైగా.. అంతకన్నా మరింత ఆనందమైన విషయాన్ని ప్రకటించనున్నాం అని మనోజ్ తన ట్విట్టర్ లో పెట్టారు. దాంతో.. మోహన్ బాబు చెప్పబోతున్న ఆ వార్త ఏమై ఉంటుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయం ఏంటంటే…
డా. మోహన్ బాబు ముద్దుల కుమార్తె లక్ష్మీప్రసన్న మంచు తల్లయ్యింది. సరోగసీ విధానంలోనే లక్ష్మీ తల్లయ్యిందని మోహన్ బాబు తెలిపారు. ఆడపిల్ల పుట్టిందని, తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చాలా ఉద్వేగంగా చెప్పారు.
మోహన్ బాబు ఏదైనా సరే ముక్కుసూటిగా చెబుతారు. ఎలాంటి విషయాన్నయినా నిర్భయంగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఆయన నైజం. ఈ విషయంలో కూడా అదే ముక్కుసూటితనాన్ని ప్రదర్శించారు మోహన్ బాబు. తన కుమార్తె సరోగసీ ద్వారా తల్లయిన విషయాన్ని ఆయన బాహాటంగా ప్రకటించారు.
తమ కుటుంబంలోకి కొత్త మెంబర్ వస్తున్న సందర్భంగా తమ ఇంట్లో భారీ ఎత్తున పండగ చేయడానికి గత కొన్ని రోజులుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. మోహన్ బాబు తన బిడ్డలను చాలా ప్రేమగా చూసుకుంటారు. పైగా, ఆడపిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. సో.. తన కుమార్తె ‘అమ్మ’ కావడం అనేది ఆయనకు మరింత ఆనందంగా ఉంది. పైగా ఈ రోజు (15.6.2014) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పిల్లలు కానుకలు ఇస్తుంటారు. లక్ష్మీ మంచు ఈ యేడాది తన తండ్రికి మంచి కానుక ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇప్పటికే విష్ణు, విరానికాల బిడ్డలు ఆరియానా, వివియానాలతో ‘తాతా’ అని పిలిపించుకుంటున్న మోహన్ బాబు ఇప్పుడు మళ్లీ తాత కావడంతో చాలా ఉద్వేగంగా ఉన్నారు.
ఇదిలా ఉంటే మన తెలుగు పరిశ్రమలో సరోగసీ విధానం ద్వారా తల్లయిన మొదటి ఘనత లక్ష్మీకే దక్కుతుంది. బాలీవుడ్ హీరోలు ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ ఈ విధానం ద్వారా తండ్రులైన విషయం తెలిసిందే

Exit mobile version