
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘లింగా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఫేమస్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని ఫాస్టెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేయడం కోసం పాన్థమ్ ఫ్లెక్స్ 4కె హై స్పీడ్ కెమెరాని ఉపయోగించాడు.
సినిమా కోసం ఏమన్నా చేయడానికి సిద్దపడే ఈ సినిమాటోగ్రాఫర్ తాజాగా ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయడం కోసం 150 అడుగుల ఎత్తున్న కొండని ఎక్కి అక్కడ నుంచి షూట్ చేసారు. రత్నవేలు ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అలాగే ఈ మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ అన్నిటినీ రజినీ ఎలాంటి దూప్ లేకుండా చేస్తున్నాడని సమాచారం. రజినీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.