
బ్యూటిఫుల్ కేథరిన్ ట్రేసా తెలుగులో అటు చిన్న హీరో మరియు పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పటికీ లుక్స్ పరంగా ఆకట్టుకోగలిగింది కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. చెప్పాలంటే తనకి తెలుగులో ఆఫర్స్ కూడా లేవు. కానీ అదే టైంలో తమిళంలో అడుగుపెట్టి ఓ సినిమా చేసింది. అదీ కార్తీ హీరోగా నటించిన ‘మద్రాస్’.
ఈ సినిమా ఇటీవలే విడుదలై తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ మరియు లుక్ తో తమిళ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ తో కేథరిన్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సూర్య తదుపరి సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. ఇదే కాకుండా పలు ఆఫర్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేథరిన్ తెలుగులో మంచు విష్ణు సరసన ‘ఎర్రబస్సు’ సినిమాలో నటిస్తోంది.