రోబో సీక్వెల్ కి టైటిల్ మార్చేస్తున్న శంకర్

robo2
2010నాటికి హై టెక్నికల్ వాల్యూస్ తో చేసిన సౌత్ ఇండియా నుంచి వచ్చిన సినిమా ‘రోబో’. సూపర్ స్టార్ రజినీకాంత్ – సౌత్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సౌత్ ఇండియన్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు శంకర్. ఇప్పటికే స్క్రిప్ట్ ని మొత్తం రెడీ చేసిన శంకర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల్ని కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారు.

ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించని విధంగా ఈ సినిమాని తీర్చి దిద్దనున్నాడు. 3డి ఫార్మాట్ లో తీయనున్న ఈ సినిమాని ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా చేసి ఇంటర్నేషనల్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాడు. అందుకే రోబో సీక్వెల్ కి ‘రోబో 2’ అనే టైటిల్ కాకుండా మరో సరికొత్త టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు. సౌత్ నుంచి ఇంటర్నేషనల్ వరకూ ఓ సినిమాని ఒకే టైటిల్ తో ప్రమోట్ చేయడానికి శంకర్ ఈ సినిమా టైటిల్ ని మార్చే ఆలోచనలో ఉన్నారు. డిసెంబర్ లో అధికారికంగా లాంచ్ చేసే రోజున ఈ సినిమా అధికారిక టైటిల్ ని అనౌన్స్ చేస్తారు. 2016 జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

Exit mobile version