
కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సెల్ఫీరాజా’ అనే సినిమా గత శుక్రవారం పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు అంతటా మంచి అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర్నుంచి కేవలం ఫర్వాలేదనే టాక్‌ని మాత్రమే తెచ్చుకుంది. అయితే గత కొద్దిరోజులుగా సినిమాలేవీ రాకపోవడంతో, సెల్ఫీరాజా బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్ళనే రాబడుతున్నాడు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా ఆదివారం పూర్తయ్యే సరికల్లా బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందని నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర తెలియజేశారు.
సినిమా బీ,సీ సెంటర్స్‌లో బాగా వసూళ్ళు సాధిస్తోందని, రేపట్నుంచి నైజాంలో లాభాలు రానున్నాయని అనిల్ ఈ సందర్భంగా అన్నారు. జీ. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన కామ్న రనావత్ హీరోయిన్‌గా నటించారు. ఎక్కువగా స్పూఫ్‌లనే ఆధారంగా చేసుకొని నవ్వించే ప్రయత్నం చేసిన ఈ సినిమాను గోపీ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.