సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న సినిమా సైరా. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన ఈ సినిమా తాజా షెడ్యూల్ ఎల్లుండి నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. అమితాబ్ బచ్చన్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. రెండు రోజులు అమితాబ్ ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. షూటింగ్ ఆలస్యం కాకుండా పక్కా ప్రణాళికతో షూట్ ప్లాన్ చేసారు యూనిట్.
నయనతార ఈ సినిమాలో చిరు సతీమణి పాత్రలో కనిపించబోతోంది. విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ వంటి నటులు ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసి అధికారికంగా అనౌన్స్ చెయ్యబోతున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమా ను చరణ్ ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
