అఖిల్ మూడో సినిమా ప్రారంభం అయ్యింది. వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ చిత్ర దర్శకుడు వెంకి అట్లూరి అఖిల్ మూడో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఒక ప్రముఖ హీరోయిన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతోందని తెలుస్తోంది. తమన్నా, కాజల్ వంటి హీరోయిన్స్ ఈ సినిమాలో కీ రోల్ లో నటించబోతోంది. ఈ పాత్ర ఎవరు చేస్తారు అనే విషయం పై త్వరలో క్లారిటి రానుంది. నితిన్ తో లై, చల్ మోహన్ రంగ సినిమాల్లో నటించిన మేఘా ఆకాష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
