బిగ్ బాస్ లో సందడి చేయనున్న స్టార్ హీరో !

kamal haasan

లోక నాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం’ విశ్వరూపం 2′. ఈచిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న సంధర్బంగా కమల్ ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు.దాంట్లో భాగంగా ఈ రోజు హైద్రాబాద్లో జరుగనున్నఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్న కమల్.

అయితే అంతకంటే ముందు బుల్లితెర రియాల్టీ షో తెలుగు ‘బిగ్ బాస్2’ లో తన చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. తమిళ బిగ్ బాస్ కి కమల్ హాసనే హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన ఈ తెలుగు బిగ్ బాస్ లో ప్రమోషన్స్ చేయడం ద్వారా ‘విశ్వరూపం 2’ కి ఎంత వరకు హెల్ఫ్ అవుతుందో చూడాలి.

Exit mobile version