దసరా బరిలో ధనుష్ !

dhanush

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం ‘వడచెన్నై’. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈచిత్రం లో ధనుష్ జాతీయ స్థాయి క్యారమ్ ఆటగాడి పాత్రలో కనిపించనున్నాడు. ఐశ్వర్య రాజేష్, ఆండ్రియా ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. 35సంవత్సరాల క్రితం ఉత్తర చెన్నై లోని ప్రజల జీవిత కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ధనుష్ లైకా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు.

కబాలి ఫెమ్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకులముందు రానుంది. ఇక ఈచిత్రం జ్యోతిక ‘కాట్రిన్ మొళి’ అలాగే విశాల్ ‘పందెంకోడి 2’చిత్రాలతో బాక్సాఫిస్ వద్ద పోటీ పడనుంది. ఈ రెండు చిత్రాలు అక్టోబర్ 18న విడుదలకానున్నాయి.

Exit mobile version