యాక్షన్ సన్నివేశాల్లో సాహో !

saaho 2

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు మరి కొంతమంది నటులపై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్ ను నిర్మించారు. ఈనెల చివరి వరకు అక్కడే షూటింగ్ జరుపుకోనుంది ఈ చిత్రం .

‘రన్ రాజా రన్’ ఫెమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో జాకీ ష్రాఫ్, నిల్ నితిన్ ముకేశ్, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రద్ధ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రాన్ని యు వి క్రియేషన్స్ నిర్మిస్తుంది. భారీ అంచనాలతో వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలకానుంది ఈ చిత్రం.

Exit mobile version