నాని సూపర్ హిట్ సినిమా కోలీవుడ్లో రీమేక్ అవ్వనుంది !

Ninukori2

ప్రస్తుతం కోలీవుడ్ చూపు తెలుగు ఇండస్ట్రీ ఫై పడినట్లుంది. ఇక్కడ సూపర్ హిట్ అయిన చిత్రాలను తమిళ్ లో రీమేక్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ నటించిన టెంపర్, నాన్నకు ప్రేమతో చిత్రాలను తమిళం లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో తెలుగు సూపర్ హిట్ చిత్రం కోలీవుడ్ కు వెళ్లనుంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘నిన్నుకోరి’. గత ఏడాది ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ ను సాధించింది. నివేత థామస్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నటించారు. మలయాళీ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. డివివి ఎంటైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి ఈచిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ సినిమా ఇప్పుడు తమిళ భాషలో రీమేక్ అవుతుంది. యువ హీరో వైభవ్ నాని పాత్రలో నటించే అవకాశాలు వున్నాయట. కాస్మో కిరణ్ నిర్మించనున్న ఈ చిత్రం యొక్క వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version