విశ్వాసం లేటెస్ట్ అప్ డేట్స్ !

ajith
తమిళ స్టార్ హీరో తల అజిత్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న చిత్రం విశ్వాసం. ఈ చిత్ర షూటింగ్ చాలా రోజులనుండి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. అతి త్వరలో ఈ లాంగ్ షెడ్యూల్ ను ముగించుకొని నెక్స్ట్ షెడ్యూల్ కోసం చెన్నై వెళ్లనుంది చిత్ర యూనిట్. ఇక ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తి చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకోసం 3నెలల సమయం తీసుకోని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈచిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.

నయనతార కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తన్నారు. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇక శివ ,అజిత్ కలయికలో వస్తున్న ఈ నాల్గవ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version