
నందమూరి హరికృష్ణగారి మరణంతో సినీ రాజకీయ రంగాలు తీవ్ర దిగ్భ్రాంతి లోనయ్యాయి. హరికృష్ణగారి మృతి పై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్విటర్ లో హరికృష్ణగారి చిన్నప్పటి ఫోటో పోస్ట్ చేస్తూ ఆయనకు సంతాపం తెలిపారు.
‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథసారథ్యం. చిన్నతనంలోనే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం’ అని క్రిష్ హరికృష్ణగారి గురించి చెప్తూ.. నందమూరి హరికృష్ణ గారు 1962 జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో ఎన్టీఆర్ గారి కంటే ముందు నడిచారు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో ‘హరికృష్ణ’గారి పాత్ర కూడా ఉంది. ‘ఎన్టీఆర్చైతన్య రథానికి’ ‘హరికృష్ణ’ సారధిగా వ్యవహరించారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ లో ఆ విషయాలన్నిట్ని చూపించనున్నారు.